ఆన్ లైన్ డిగ్రీకి నోటిఫికేషన్ : మూడు దశల్లో అడ్మిషన్స్

GOKULడిగ్రీ ఆన్ లైన్ అడ్మిషన్స్ నోటిఫికేషన్ ను విడుదల చేసింది ఉన్నత విద్యామండలి. మూడు దశల్లో అడ్మిషన్ ప్రక్రియ కొనసాగుతుంది. ఇందుకు సంబంధించిన గైడ్ లైన్స్ పై అవగహన కల్పించేలా కార్యక్రమాలను చేపడుతుంది.
విద్యారంగలో నాణ్యతను పెంచడానికి స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయ్యర్ ఎడ్యూకేషన్, కమిషనర్ కాలేజీ ఎడ్యూకేషన్ రుసా ద్వారా డిగ్రీ ఆన్ లైన్ అడ్మిషన్ ప్రక్రియను 2016లో దోస్త్ పేరుతో ప్రారంభించింది రాష్ట్ర ప్రభుత్వం. 2016-17లో 2లక్షల 15 వేల 425 మంది, 2017-18లో 2లక్షల 23 వేల 627 మంది విద్యార్ధులకు దోస్త్ ద్వారా అడ్మిషన్స్ ఇచ్చారు. ఇక 2018-2019 అకాడమిక్ ఇయర్ లో డిగ్రీ అడ్మిషన్ ప్రక్రియకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేసింది ఉన్నత విద్యామండలి.
షెడ్యూల్ ప్రకారం మే 8 నుంచి జూలై 2వ తేదీ వరకు డిగ్రీ అడ్మిషన్ ప్రక్రియ ఉంటుందని కన్వీనర్ లింబాద్రి తెలిపారు. రిజిస్ట్రేషన్ అండ్ వెబ్ అప్షన్స్ మే10 నుంచి మే26 వరకు కొనసాగుతుంది. లేట్ ఫీజుతో మే 27 నుం చి 29 వరకు రెండు రోజుల సమయం ఇచ్చారు. ఇక సీట్స్ అలాట్ మెంట్ ఫస్ట్ ఫేస్ జూన్ 1 నుంచి 4 వరకు ఉంటుంది. జూన్ 13 నుంచి 19 వరకు సెకెండ్ ఫేజ్, జూన్ 26, 27 తేదీల్లో మూడు ఫేస్ ద్వారా అడ్మిషన్ ప్రక్రియ ఉంటుంది. జూలై 2 సెకెండ్ నుంచి తరగతులు ప్రారంభం అవుతాయి.
ఈసారి షెడ్యూల్ ను అడ్వాన్డ్స్ గా ప్రిపేర్ చేసినట్లు చెబుతున్నారు అధికారులు. పాటించాల్సిన ప్రణాళికలను అధికారుల సమక్షంలో చర్చించి, ఒక డ్రాఫ్ట్ గైడ్ లైన్స్ ను తయారు చేశారు. యూనివర్సిటీ ఎడ్యుకేషన్ యాక్ట్, తెలంగాణ ఎడ్యూకేషన్ యాక్ట్ ప్రకారం గైడ్ లైన్స్ ప్రక్రియను ఎలా కొనసాగించాలనే దానిపై నిర్ణయం తీసుకున్నారు అధికారులు. గతంలో ఉన్న ఎలిజిబిలిటి క్రైటిరియాను యునిఫాం చేయటంతో పాటు మీడియం, లాంగ్వేజ్ మార్పుపై సూచనలను ఈ గైడ్ లైన్ లో పెట్టామన్నారు. దోస్త్ ద్వారా అడ్మిషన్ పొందిన విద్యార్ధులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూస్తున్నామని, ఏమైనా సమస్యలుంటే మే 8వ తేదీ లోపు పరిష్కారించే వెసులుబాటు కల్పిస్తున్నట్లు తెలిపింది ఢిగ్రీ ఆన్ లైన్ సర్వీసెస్ తెలంగాణ.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy