ఆన్ లైన్ డేటింగ్ లో మగాళ్లు వీక్

Confused datingమగాళ్లు మాటలతో కోటలు కట్టేస్తారని అందరూ అంటుంటారు. కానీ ఇదంతా ఉత్తదే అని తేల్చింది ఓ సర్వే. ఆన్ లైన్ చాటింగ్ లో మగాళ్లు వెరీ పూర్ అని ట్రూలీ మాడ్లీ అనే డేటింగ్ యాప్ చేసిన సర్వేలో తేలింది. మగాళ్లకి ఆన్ లైన్ లో ఆడవాళ్లతో ఇంప్రెస్సివ్ గా చాట్ చేయడం రావడం లేదట. 550 మంది ఆడవాళ్ల ఒపీనీయన్స్ తీసుకుని ఈ రీసెర్చ్ చేశారు. ఈ సర్వేలో పాల్గొన్న ఆడాళ్లలో వందలో అరవై మూడు శాతం మంది..  కన్వర్జేషన్ స్కిల్స్ పెంచుకోవాలని మగాళ్లకి సూచించారట. వీరి ఏజ్ లిమిట్ 18 నుంచి 25 ఏళ్లు ఉండటం విశేషం. 23 నుంచి 35 ఏళ్ల మధ్యలో ఉన్న ఆడవాళ్లలో 73 శాతం మంది ఇదే ఒపీనీయన్ కి సపోర్ట్ చేశారట. ఇక 29 శాతం మంది 18 నుంచి 25 ఏళ్ల అమ్మాయిలు క్యాజువల్ రిలేషన్ షిప్ కోసం చూస్తున్నట్లు, 88 శాతం మంది 26 నుంచి 35 ఏళ్ల ఆడవాళ్లైతే లాంగ్ లీవ్ రిలేషన్ షిప్ కోరుకున్నట్లు తేలింది. సర్వేలో మరికొన్ని ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి. డేటింగ్ కి  26 నుంచి 34 ఏళ్ల ఆడవాళ్లలో సగానికి సగం మంది ప్రిఫర్ చేస్తున్నట్లు, 18 నుండి 25 ఏళ్ల అమ్మాయిలు 36 శాతం ఈ ఆప్ ని ప్రిఫర్ చేస్తున్నట్లు తేలింది. ఇక ఫైనల్ గా 38 శాతం అమ్మాయిలు సేమ్ సిటిలో వాళ్లతో డేట్ చేయడానికి ఇష్టపడుతున్నట్లు కూడా ఈ సర్వే లో తేలింది. సో జెంట్స్ కొంచెం చాటింగ్ స్కిల్స్ పెంచుకుంటే బెటర్.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy