ఆన్ లైన్ మోసం : ఎత్తు పెరిగే మందులు వాడి చనిపోయాడు

్ాుం్ొ-ంలుయమీరు లావుగా ఉన్నారా.. మా మెడిసిన్ వాడితే రోజుల్లోనే స్లిమ్ గా తయారవుతారు.. ఎక్సర్ సైజ్ చేయాల్సిన అవసరం కూడా లేదు.. ఇదీ ఓ ప్రకటన. మీరు పొట్టిగా ఉన్నారా.. అందరిలో తక్కువగా ఉన్నారా.. మనోవ్యథకి గురవుతున్నారా.. టెన్షన్ వద్దు.. వెంటనే మా మెడిసిన్ వాడండి.. 40 రోజుల్లోనే తలెత్తుకుని తిరగండి.. ఇదీ మరో ప్రకటన సారాంశం. ఇలాంటి హైట్ ప్రకటనే ఓ యువకుడి ప్రాణం తీసింది. తెలంగాణ రాష్ట్రం వనపర్తి జిల్లాలో జరిగిన ఈ ఘటన సంచలనం అయ్యింది. వివరాల్లోకి వెళితే..

ఖాజా నజీర్ (17) స్టూడెంట్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. నజీర్ పొట్టిగా ఉంటాడు. ఆరోగ్యంగానే ఉన్నాడు. అయినా ఎత్తు లేకపోవటంతో బాధపడేవాడు. ఈ టైంలోనే టీవీలో ఓ యాడ్ చూశాడంట. మేం ఇచ్చే మందులు వాడితే ఎత్తు పెరుగుతారన్న ప్రకటనకు ఎట్రాక్ట్ అయ్యాడు నజీర్. వెంటనే ఆన్ లైన్ ద్వారా మందలు ఆర్డర్ చేశాడు. వాటిని మూడు రోజులు వాడిన తర్వాత వాంతులు, విరేచనాలు అయ్యాయి. వెంటనే వనపర్తి ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స తర్వాత కోలుకున్నా.. కొన్నిరోజుల తర్వాత మళ్లీ అదే సమస్య రావడంతో చికిత్స చేయిస్తూ వచ్చారు కుటుంబ సభ్యులు.

అయినా పూర్తిగా కోలుకోలేదు. ఇన్ ఫెక్షన్ కూడా సోకింది. ఈ క్రమంలోనే మహబూబ్ నగర్ ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లాల్సిందిగా సూచించారు వనపర్తి వైద్యులు. జనవరి 23వ తేదీ మంగళవారం చికిత్స పొందుతూ మృతి చెందాడు నజీర్. చేతికి వచ్చిన కుమారుడు.. దరిద్రుపు ప్రకటన చూసి ప్రాణాలు తీసుకున్నాడని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. టీవీల్లో వచ్చిన యాడ్ చూసి ఇలా ప్రాణాలు తీసుకున్నాడని చెబుతున్నారు నజీర్ పేరంట్స్.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy