ఆపద్బాంధవుడు ఎక్కడ..?

accidents-in-Telanganaఆపద్బాంధవుడు ఆదుకోకుండా వదిలేస్తున్నాడు. యాక్సిడెంట్లలో చనిపోయిన వారిని ఆదుకోవాల్సిన ఆపద్బంధు పథకం.. సరిగా అమలు కావడం లేదంటున్నారు బాధితులు. అప్లికేషన్లు ఎన్ని ఇచ్చినా.. సాయం అందడం లేదంటున్నారు. సర్కార్ సాయం కోసం సెక్రటేరియట్ చుట్టూ తిరుగుతున్నారు లబ్దిదారులు.

17 రకాల ప్రమాదాలకు ఆపద్బంధు పథకం వర్తిస్తుంది. రోడ్ యాక్సిడెంట్స్, కర్ ఫ్యూలో మరణాలు, పడవ ప్రమాదాలు, వరదలు, తుఫాన్లు, పిడుగు పాట్లు, భవనాలు, బ్రిడ్జిలు కూలడం, విద్యుత్ షాక్, మత ఘర్షణల్లో చనిపోవడం, భూ కంపాలు, పాము కాటు, హఠాత్తుగా చనిపోవడం, తాటి చెట్టు పైనుంచి కింద పడ్డం, కుక్క కాటు, వరకట్నం వేధింపులు, వడదెబ్బతో చనిపోయిన వారి కుటుంబాలకి ఈ పథకం కింద సాయం చేస్తుంది సర్కార్.

పేద కుటుంబానికి చెందిన వారు యాక్సిడెంటల్ గా చనిపోతే..  వాళ్ల ఫ్యామిలీకి 50 వేలిస్తుంది సర్కార్. 2013-2014 ఏడాదిలో మొత్తం 15 వందల 5 అప్లికేషన్లొచ్చాయి. కానీ ఇప్పటి వరకు 775 మందికే సాయం అందింది. మిగతా వారికి సెక్రటేరియట్ చుట్టూ తిరగక తప్పడం లేదు.

ఈ ఏడాదికి సంబంధించిన లెక్కలు…సర్కార్ కు పూర్తిగా అందలేదు. కొన్ని జిల్లాల కలెక్టర్లు మాత్రమే సర్కార్ కి రికార్డులు పంపారు. మెదక్, నల్గొండ, రంగారెడ్డి, ఖమ్మం జిల్లాల కలెక్టర్ల రియాక్షనే లేదు. ఆదిలాబాద్ 113, మహబూబ్ నగర్, కరీంనగర్ ల నుంచి 99, వరంగల్ నుంచి 62, నిజామాబాద్ నుంచి 87, హైదరాబాద్ అధికారులు 55 మంది పేర్లు పంపారు. వీళ్లు అప్లై చేసి చాలా టైం అవుతున్నా.. తమకీ సాయమందలేదంటున్నారు బాధితులు.

ప్రతి ఏటా అక్టోబర్, నవంబర్ నెలల్లో ఆపద్బంధు పథకానికి ఎక్స్ టెన్షన్ జీవో రిలీజ్ కావాలి. కానీ.. ఇంకా జీవో రాకపోవడంతో.. బాధితులకి బాధలు తప్పడం లేదు. ప్రభుత్వం స్పందించి.. ఆపద్బంధు పథకానికి సంబంధించి జీవో రిలీజ్ చేయాలంటున్నారు బాధితులు. అయితే.. అత్యవసర నిధుల నుంచి కలెక్టర్లైనా సాయం అందించాలని సర్కార్ ఆర్డర్ చేసింది.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy