ఆపరేషన్ గోల్డ్ ఫిష్

GOLD FISHమన ఇళ్లలో పెంచుకుంటున్న పెంపుడు జంతువులను మన ఇంటి మనుషుల్లాగే ప్రేమిస్తాం.. వాటికేమైనా జబ్బు చేస్తే మన సొంత పిల్లలకు రోగం చేసినంతగా బాధ పడుతాం. వెంటనే వాటిని చికిత్స కోసం వెటర్నరీ డాక్టర్‌ దగ్గరికి తీసుకెళ్తాం. సరిగ్గా అలాగే చేసింది ఇంగ్లండ్‌లోని ఓ కుటుంబం. అయితే ఇక్కడ జబ్బు చేసింది ఏ కుక్కకో.. పిల్లికో అయితే కాదు. ఒక బంగారు చేప (గోల్డ్‌ ఫిష్‌)కు. ఆ గోల్డ్‌ ఫిష్‌ వయసు 20 ఏళ్లు. దాని శరీరం లోపల ఒక ట్యూమర్‌ ఉన్నట్లు  తెలియడంతో వెంటనే ప్రముఖ డాక్టర్ డాక్టర్‌ ఫాయే బేతేల్‌ వద్దకు తీసుకెళ్లారు కుటుంబ సబ్యులు.

సుమారు 30 నిమిషాల పాటు డాక్టర్‌ సర్జరీ నిర్వహించి అతి కష్టం మీద ఆ ట్యూమర్‌ను తీసేసి ఆ చేపను కాపాడారు. చేపకు అనస్థీసియా ఇచ్చి శస్త్ర చికిత్స నిర్వహించినట్లు ఆపరేషన్‌ తర్వాత డాక్టర్‌ చెప్పారు. చేప ఎంతో చిన్నది కావడంతో ఆపరేషన్‌ చేయడం ఎంతో కష్టతరమైందని ఆమె తెలిపారు. ప్రస్తుతం చేప ఆరోగ్యం నిలకడగా ఉందని, తన ఇంట్లో ఆనందంగా ఈత కొడుతోందని పేర్కొన్నారు. ఆ చేప వయసు ఆ యజమాని పిల్లల వయసు కంటే ఎక్కువే. అందుకే ఆ చేప అంటే ఆ యజమానికి ఎనలేని ప్రేమ.. ఇంతకీ ఆ ఆపరేషన్‌కు అయిన ఖర్చు ఎంతో తెలుసా.. అక్షరాల 250 డాలర్లు (సుమారు రూ. 17 వేలు).

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy