ఆపరేషన్ పఠాన్‌కోట్‌..ఆరుగురు టెర్రరిస్టులు హతం

pathankot airbase securityపఠాన్ కోట్ ఎయిర్ బేస్ పై ఎటాక్ లో మరో ఇద్దరు ఉగ్రవాదులను కాల్చిచంపాయి భద్రతా బలగాలు. 60 గంటలకు పైగా జరిగిన ఆపరేషన్ లో… మొత్తం ఆరుగురు టెర్రరిస్టులను అంతం చేశాయి. ఎయిర్ ఫోర్స్ సిబ్బంది నివసించే క్వార్టర్స్ తో దాక్కున్న ఇద్దరు టెర్రరిస్టుల కోసం భారీ ఆపరేషన్ నిర్వహించారు. ఆర్మీ సిబ్బంది, NSG కమెండోలు, పంజాబ్ పోలీసులు కలిసి ఆపరేషన్ లో పాల్గొన్నారు. 2 వేల ఎకరాల ఎయిర్ బేస్ ను జల్లెడపట్టారు. దీంతో.. మిగిలిన ఇద్దరు టెర్రరిస్టుల మృతదేహాలను గుర్తించారు.  మూడు రోజుల పాటు ఆపరేషన్ జరిగినా.. ఎయిర్ బేస్ లో ఎలాంటి ఆస్తులు ధ్వంసం కాలేదని అధికారులు ప్రకటించారు. క్వార్టర్స్ లో నివసిస్తున్న 1500 మంది కుటుంబాలు కూడా సేఫ్ గా ఉన్నాయని ప్రకటించారు. డిసెంబర్ 30 అర్థరాత్రి తర్వాత దేశంలోకి ఎంటర్ అయిన తీవ్రవాదులు… రెండు టీంలుగా విడిపోయారని అధికారులు తేల్చారు. ఎస్పీ స్థాయి అధికారిపై ఒక టీమ్ అటాక్ చేయగా… మరో టీమ్ టార్గెట్ స్పాట్ వైపు వెళ్లింది. ఎస్పీని కిడ్నాప్ చేసిన టీమ్… మరో టీమ్ కు ఫోన్ చేసి మీరెందుకు వెనుకుబడ్డారంటూ సీరియస్ గా మాట్లాడినట్టు ఆర్మీ అధికారులు గుర్తించారు. ఆ తర్వాత రెండు టీమ్ లు ఎయిర్ బేస్ లోకి ప్రవేశించాయి. టెర్రరిస్టులు ఇలాంటి యాక్షన్ ప్లాన్ తో ఎటాక్ చేయడం ఇదే ఫస్ట్ టైమ్ అంటున్నారు ఎక్స్ పర్ట్స్. మరోవైపు ఈ టెర్రర్ ఎటాక్ కారణంగా ఈనెల 15న జరగాల్సిన భారత్, పాక్ విదేశాంగ కార్యదర్శుల స్థాయి చర్చలు డైలమాలో పడ్డాయి. ఆపరేషన్ పూర్తయ్యాక చర్చలపై నిర్ణయం తీసుకుంటామన్నారు కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ. రక్షణ దళాల ఆస్తుల విధ్వంసమే లక్ష్యంగా సూసైడ్ స్క్వాడ్ ఈ ఎటాక్ చేశారన్నారు. భద్రతా బలగాలు అలర్ట్ తోనే … నష్టాన్ని తగ్గించగలిగామన్నారు జైట్లీ. ఆరుగురు టెర్రరిస్టులు చనిపోగా… మరికొంత మంది టెర్రరిస్టులు ఇంకా ఉండొచ్చన్న అనుమానంతో పఠాన్ కోట్ ఎయిర్ బేస్ లో సెర్చ్ ఆపరేషన్ కంటిన్యూ చేస్తున్నారు అధికారులు.

 

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy