ఆప్ కష్టాలు…

imagesప్రజాసమస్యల  పరిష్కారమే ఎంజెండాగా ఢిల్లీ పీఠాన్ని  చేజిక్కించుకున్న ఆమ్ ఆద్మీపార్టీ సమస్యల సుడిగుండంలో కొట్టు మిట్టాడుతోంది.ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ఆప్ విఫలమైందంటూ  ఆ పార్టీ నేతలు ఆరోపణలకు దిగుతున్నారు.ఆప్ లో నిబద్ధత కొరవైందని, ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందని ఆరోపిస్తూ వినోద్ కుమార్ బిన్నీ పార్టీ బహిష్కరణకు గురైయ్యారు. ఈ వివాదం సద్దుమణగక ముందే ఇండిపెండెంట్ ఎమ్మెల్యే రాంబీర్ షోకీన్ తన మద్దతు ఉపసంహరించుకునేందుకు సిద్ధమవుతున్నారు. ప్రజలకు చేసిన వాగ్దానాల అమలులో ఆప్ ప్రభుత్వం వెనుకంజ వేసిందని షోకీన్  ఆరోపించారు. ప్రభుత్వానికి ఇస్తున్న మద్దతును లాంఛనంగా ఉపసంహరించుకునేందుకు లెప్టినెంట్ గవర్నర్  నజీబ్ జంగ్ ను ఇవాళ కలువనున్నారు.ముండ్కా నియోజకవర్గం  నుంచి గెలిచిన స్వతంత్ర ఎంఎల్ ఎ షోకీన్  ఆప్ కు మద్దుతు ఇచ్చారు.ఢిల్లీలో నీటి సమస్య,  కాంట్రాక్టు టీచర్లను  పర్మినెంట్ ,మహిళా రక్షణకు సంబంధించిన హామీలపై కేజ్రీవాల్ నుంచి స్పందన కరువైందని ఎద్దేవా చేశారు. అంతే కాదు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన నాటి నుంచి ఇప్పటి వరకు గ్రామాల్లో మంత్రులు..కేజ్రీవాల్ పర్యటించలేదని ఆరోపించారు రామ్ బీర్.

జన్ లోక్ బిల్లుపై ఆప్ సర్కార్ ఇప్పటికే ఒత్తిడి ఎదుర్కొంటోంది. బిల్లు ఆమోదం కోసం తీవ్రంగా కృషి చేస్తోంది. ఈ సమయంలో  షోకీన్ మద్దతు ఉపసంహరణ నిర్ణయంతో  70 మంది ఉన్న ఆప్ ప్రభుత్వ బలం 35 పడిపోనుంది. దీంతో ఆప్ కు మరింత సంక్షోభం ఎదురుకానుంది.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy