ఆఫ్ స్క్రీన్ లోనూ తొమ్మిది సినిమాలు హిట్..!

jaya-restఆఫ్ స్క్రీన్ లోనూ సిల్వర్ స్క్రీన్ యాక్టర్ల మధ్య అద్భుతంగా కెమిస్ట్రీ పండింది. సినిమా యాక్టర్ల  పెళ్లిళ్లు  సక్సెస్ కావని చాలా మంది అనుకుంటారు. అవన్నీ అపోహలేనని  ప్రూవ్  చేశాయి ఎన్నో బాలీవుడ్  జంటలు. హిందీ  ఫిల్మ్ ఇండస్ట్రీలో కొన్ని జంటల మధ్య  ఆన్  స్క్రీనే  కాదు ఆఫ్ స్క్రీన్  కూడా  కెమిస్ట్రీ  బాగా వర్కవుట్ అయ్యింది.

బాలీవుడ్ లో ఇప్పటి వరకూ తొమ్మిది జంటల స్టోరీలు సక్సెస్ అయ్యాయి. బాలీవుడ్ లో  రియల్  లైఫ్ కపుల్  అనగానే ఎవరికైనా ఠక్కున గుర్తుకు వచ్చేది  అమితాబ్ బచ్చన్……జయ జంట. బి ఆర్ ఇషారా  …..ఏక్ నజర్  సినిమా జరుగుతుండగా…..ఇద్దరి మధ్య  ప్రేమ చిగురించింది. అయితే, 1973 లో జంజీర్ రిలీజ్ అయ్యేంతవరకు  లవ్ అఫైర్ ను బయటపెట్టలేదు వీళ్లు. జంజీర్ సినిమా హిట్ అయిన ఆనందంలో  అమితాబ్ , జయ పెళ్లి చేసుకున్నారు.

1728983బాలీవుడ్ లో  మరో  సక్సెస్ ఫుల్  జంట ధర్మేంద్ర, హేమామాలిని.  తుమ్ హసీన్ ……మై జవాన్ సినిమా సెట్స్ పై  ఇద్దరూ  ప్రేమలో  పడ్డారు. ఆ తరువాత  పెళ్లి చేసుకున్నారు. ఎన్నో హిట్ సినిమాల్లో నటించారు. మ్యారేజ్ ను  సక్సెస్ చేసుకున్నవారిలో  అలనాటి జంట దిలీప్ కుమార్,  సైరా బానో ను   ప్రత్యేకించి  చెప్పుకోవాలి.   తెరపై  దిలీప్  కుమార్ ను చూసి పన్నెండేళ్ల వయస్సులోనే  పీకల్లోతు ప్రేమలో పడిపోయింది  పన్నెండేళ్ల  సైరా బానో.  ఫిల్మ్  ఇండస్ట్రీలోకి  ఎంటరైన తరువాత….దిలీప్ సాబ్ తో  లవ్  కొనసాగించింది. 1966లో  ఇద్దరూ  పెళ్లి చేసుకున్నారు.  మ్యారేజ్ నాటికి……సైరా బానో  వయస్సు 22 కాగా, దిలీప్ వయస్సు  45. వయస్సులో  అంత తేడా ఉన్నా….ఇప్పటికీ ఇద్దరూ హ్యాపీగా  లైఫ్  లీడ్ చేస్తున్నారు.

1369377482_79338నిన్నటి తరంలో  చెప్పుకోవాల్సిన జంట రిషి కపూర్, నీతూ సింగ్ ది.  ఎనభైలో  వీరిద్దరూ….మంచి హిట్  పెయిర్ గా  పేరు తెచ్చుకున్నారు. 1979లో  మ్యారేజ్  చేసుకున్నారు  లవర్ బోయ్  రిషి కపూర్ ,  సహజ నటి నీతూ సింగ్.  అజయ్ దేవగన్….కాజోల్…..ఈ తరం  పర్ ఫెక్ట్ కపుల్.  1999లో  మహారాష్ట్ర  సంప్రదాయ పద్ధతుల్లో ఇద్దరూ   పెళ్లి చేసుకున్నారు. ఈతరం  సక్సెస్ ఫుల్  జంటల్లో   తప్పకుండా  రిఫర్ చేయాల్సింది అక్షయ్ కుమార్ ట్వింకిల్ ఖన్నాలను.  ఇంటర్నేషనల్  ఖిలాడి  సినిమా సెట్స్ పై  ఇద్దరి  మనస్సులు కలిశాయి.  తరువాత పెళ్లి చేసుకున్నారు. అయితే,  ఈ  పెళ్లి  ఎక్కువ  కాలం నిలవదని అప్పట్లో  చాలా మంది  జోస్యం చెప్పారు. కానీ వీరందరి  ఊహాగానాలను  తల్లకిందులు చేస్తూ అక్కి ట్వింకిల్  జంట హ్యాపీగా  లైఫ్  లీడ్ చేస్తోంది.

239507-abhishek-bachchan-with-wife-aishwarya-rai-bachchan-at-magic-bus.jpgఅభిషేక్  బచ్చన్…..ఐశ్వర్యా రాయ్….బాలీవుడ్ లో  వీళ్లిద్దరి  పెళ్లి పై  జరిగినంత   ప్రచారం మరే ఇతర స్టార్ల పై  జరగలేదు. ఒక దశలో  వీరిద్దరి  మ్యారేజ్ జరుగుతుందా,  ఆగిపోతుందా …అనే  ప్రచారం కూడా జోరందుకుంది. అయితే, వీటన్నిటికీ  ఫుల్ స్టాప్  పెడుతూ……2007 లో  అందాల నటి  ఐశ్వర్యను  పెళ్లాడారు అభిషేక్. రితేష్ ….జెనీలియా  దేశ్ ముఖ్……బాలీవుడ్ లో ఇదో  సక్సెస్ ఫుల్  జంట.  తుఝే  మేరీ  కసమ్  సినిమా షూటింగ్  అప్పుడు ….జెనీలియాతో  పీకల్లోతు  ప్రేమలో పడ్డాడు రితేష్.  పదేళ్ల  సుదీర్ఘ   ప్రేమాయణం తరువాత….2012 లో  ఏడడుగులు  కలిసి నడిచారు  రితేష్….జెనీలియా. తషాన్ సినిమా సెట్స్ పై   ఉండగా……కరీనా కపూర్ తో ప్రేమలో పడ్డాడు  సైఫ్ అలీ ఖాన్. అయిదేళ్ల  పాటు డేటింగ్  చేసిన తరువాత……2012 లో  కరీనా కపూర్  మెడలో కల్యాణ మాల వేశాడు  సైఫ్ అలీ .  ప్రొఫెషనల్ గా  బిజీగా  ఉంటూనే….ఇద్దరూ హ్యాపీగా  లైఫ్ లీడ్ చేస్తున్నారు.

మొత్తానికి …..రీల్ లైఫ్ లోనే కాదు….రియల్  లైఫ్ లోనూ  హిట్ అని  ప్రూవ్  చేసుకున్నాయి  ఈ తొమ్మిది జంటలు.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy