ఆమె ఆత్మీయ ఆలింగనం ఇక ఎప్పటికీ దొరకదు

hugకష్టాల్లో చిక్కుకున్నవారికి నేనున్నాననే భరోసా ఎంతో ధైర్యాన్ని ఇస్తుంది. అది వారిలో ఆత్మస్థైర్యాన్ని పెంచుతుంది. అలా  5 లక్షల మంది సైనికులకు ఆత్మీయ అలింగనంతో భరోసా, ధైర్యాన్ని ఇచ్చింది ఓ సాధారణ మహిళ. ఆమే ఎలిజబెత్ లయర్డ్. ‘ది హగ్ లేడీ ఆఫ్ ఫోర్ట్ హుడ్’ గా పేరున్న ఆమె 12 ఏళ్లలో 5లక్షల మంది సైనికులకు హగ్ ఇచ్చి రికార్డును క్రియేట్ చేశారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె క్రిస్మస్ కు ముందు రోజు డిసెంబర్ 24న గురువారం చనిపోయారు.

 

 

hug lady (3) hug lady (1)యుద్ధంలో పాల్గొనేందుకు వెళ్లే.. యుద్ధం నుంచి విజయగర్వంతో తిరిగివచ్చే సైనికులకు హగ్ ఇవ్వడం ఎలిజబెత్ కు హాబీ. అమెరికాకు చెందిన ఎలిజబెత్ టెక్సాస్ లో కన్నుమూశారు.  ఆమె వయస్సు 83ఏళ్లు. దేశం కోసం.. పోరాడే వీర సైనికులకు తన ఆత్మీయ స్పర్శతో ఎంతో ఆత్మస్థైర్యానిచ్చారు ఎలిజబెత్. అలా ఆమె 12 ఏళ్లలో అమెరికాలోని ఫోర్ట్ హుడ్ దగ్గర దాదాపు 5లక్షల మంది సైనికులకు హగ్ తో స్వాగతం, వీడ్కోలు చెప్పారామె. యుద్ధం నుంచి తిరిగి వచ్చే సైనికులు కోసం ఎదురుచూడడం బాధ్యతగా ఫీల్ అయ్యేవారు ఎలిజబెత్. కొంతకాలంగా రొమ్ము క్యాన్సర్ తో బాధపడుతున్న ఎలిజబెత్ గత నెల మొత్తం ఐసీయూలోనే ఉన్నారు. ఆరోగ్యం కాస్త బాగవడంతో కీమోథెరపీ చేయడం మానేశారు. ఎలిజబెత్ హాస్పిటల్ ఖర్చుల కోసం ‘గోఫండ్ మీ’ అనే వెబ్ సైట్ ను క్రియేట్ చేశారు ఆమె ఫ్యామిలీ మెంబర్స్. చాలామంది మాజీ సైనికులు, ప్రజలు విరాళాలు అందించారు. ఆమెతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. దాదాపు 95వేల డాలర్లు కలెక్ట్ అయ్యాయి. అయితే ఏ ట్రీట్ మెంట్.. ఎలిజబెత్ ను ఆదుకోలేకపోయింది. పవిత్ర క్రిస్మస్ పండుగ ముందు రోజు హగ్ లేడీ .. తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. ఎలిజబెత్ లేకపోయినా… ఆమె జ్ఞాపకాలు తమతోనే ఉన్నాయని.. ఆమె ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నారు ఆమె అభిమానులు.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy