ఆమ్ ఆద్మీ పాలిట్రిక్స్

VBK-KEJRIWAL_1_1700160f
పాలిట్రిక్స్ ను వంటపట్టించుకుంటున్న ఆమ్ ఆద్మీ పార్టీ…ఫండ్ సేకరణకు తమదైన స్టైల్ ను ఫాలో అవుతోంది. 20 వేలు చెల్లిస్తే చాలు… కేజ్రీవాల్ తో కలిసి భోజనం చేయవచ్చు అంటూ ప్రత్యేక ఆఫర్లు ప్రకటిస్తుంది. ఈనెల 15న జరిగే ఈఫండ్ ఫంక్షన్ ద్వారా 4 లక్షలు లక్ష్యంగా పెట్టుకుంది ఆమ్ ఆద్మీ పార్టీ. భోజనం చెయ్యి…. ఇరవై వేలు ఎకౌంట్లో వెయ్యి…అంటోంది ఆమ్ ఆద్మీ పార్టీ. పార్టీట్రిక్స్ వంటబట్టించుకుంటున్న కేజ్రీవాల్…ఈ నెల 15 న బెంగుళూరులో భోంచేయబోతున్నారు. ఆయనతో పాటూ కలిసి భోజనం చేయాలనుంటే సింపుల్ గా ఓ ఇరవై వేలు పార్టీకి చెల్లించాలి.
ఈ మీటింగ్ లో ఐటీ ఉద్యోగులు, పారిశ్రామికవేత్తలు, పెద్దలు పాల్గొననున్నారు. ఏది కావాలంటే అది అడగొచ్చట. కూరా సాంబారు కాదండోయ్. ఆమ్ ఆద్మీ పార్టీ విధానాలు, సిద్ధాంతాలపై ఎలాంటి సందేహాలున్నా అడగొచ్చు. అన్ని డౌట్లూ క్లియర్ చేసేందుకు ఈ సహాపంక్తి మీటింగ్ లో అరవింద్ కేజరీవాల్ రెడీగా ఉంటారు. రాజకీయ రంగంలో నిధుల సేకరణ అంతా చీకటి భాగోతం లాంటిదే. ఎక్కడినుంచి వస్తున్నాయి. ఎవరి నుంచి వస్తున్నాయి వంటి వాటికి లెక్కా పత్రం ఉండదు. కాబట్టి పారదర్శకత కోసం ఇలా నిధుల్ని సేకరిస్తున్నామంటున్నారు ఆపార్టీ నేతలు. అంతేకాదు..విందుతో ఆమ్ ఆద్మీ పార్టీ ఏకంగా నాలుగు లక్షల రూపాయలు సంపాదించడం లక్ష్యమట.

మొత్తానికి ఇలాంటి ఫండ్ రెయిజింగ్ డిన్నర్స్ అమెరికన్ రాజకీయాల్లో మామూలే. కానీ ఆమ్ ఆద్మీలకు అందని ద్రాక్షల్లాంటి ఇలాంటి విందుల వల్ల ఏం లాభమని ఆప్ వ్యతిరేకులు విమర్శిస్తున్నారు.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy