ఆయనే వస్తున్నాడు : ఇన్ఫోసిస్ సీఈవోగా నందన్ నిలేకని!

nandan-nilekaniసీఈవోగా విశాల్ సిక్కా రాజీనామాతో ఇన్ఫోసిస్ లో గందరగోళం ఏర్పడింది. దీంతో బోర్డు వ్యవహారాలను గాడిలో పెట్టే పనిలో పడింది యాజమాన్యం. మళ్లీ సంస్థలోకి పాతరక్తాన్ని ఎక్కించేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ఇన్ఫోసిస్ వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరైన నందన్.. 2002 – 07 మధ్య సీఈవోగా పనిచేశారు. ఆ సమయంలో కంపెనీ 3బిలియన్ డాలర్ల రాబడులు సాంధించింది. ఆ తర్వాత తన పదవికి రాజీనామా చేసిన ఆయన 2009లో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ కోరికపై ఆధార్ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన ఆయన.. 2014లో కాంగ్రెస్ తరఫున కర్ణాటక నుంచి ఎంపీ పదవికి పోటీచేసి ఓడిపోయారు. ప్రస్తుతం ఆయన ఆధార్ బాధ్యతలు చూసుకుంటున్నారు.

ఇన్ఫోసిస్ అంటే నారాయణమూర్తి ఎలాగో.. నందన్ నిలేకని కూడా అంతేస్థాయిలో గుర్తొస్తారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో బోర్డు వ్యవహారాలను సమర్థవంతంగా చక్కదిద్దగల నేర్పరి నందన్ కు ఉందని భావిస్తోంది ఇన్ఫోసిస్. మళ్లీ ఆయనకు బాధ్యతలను అప్పగించేందుకు రెడీగా ఉన్నట్టు తెలుస్తోంది.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy