ఆయన రూటే సెపరేటు..!!

rajinikanth-sivaji1రూట్ మార్చిన సూపర్ స్టార్ రజినీ

తన కొత్త మూవీకి పా రంజింత్ కు ఛాన్స్

రజనీకాంత్ సినిమా అంటేనే ఫ్యాన్స్ కి పూనకం వస్తుంది. స్క్రీన్ పై సూపర్ స్టార్ చేసే విన్యాసాల కోసం అభిమానులే కాదు… అందరూ ఎగబడతారు. కానీ కొన్నాళ్లుగా థియేటర్లలో రజనీ సందడి అంతగా కనిపించడంలేదు. చివరగా ఆయన నటించిన రెండు సినిమాలు కొచ్చాడయాన్, లింగా ఫ్యాన్స్ ని శాటిసిఫై చేయలేకపోయాయి. దీంతో తన స్టైల్ ఆఫ్ మూవీ కాకుండా కాస్త వెరైటీగా ట్రై చేయాలని ఫిక్సయ్యారట రజనీ. అందుకే పెద్దగా అనుభవం లేకపోయినా మంచి టాలెంటెడ్ అని కోలీవుడ్ నీరాజనాలందుకుంటున్న పా రంజిత్ కు నెక్స్ట్ మూవీ డైరెక్ట్ చేసే చాన్సిచ్చారు. రజనీ ఏ సినిమాలో ఏ క్యారెక్టర్ చేసినా ఎక్కడా క్యారెక్టర్ కనపడదు. అంతా సూపర్ స్టారే కనిపిస్తాడు? అలా ఉంటుంది ఆయన హవా. దీనిని తర్వాతి మూవీలో కంటిన్యూ చేయొద్దనుకుంటున్నారు తలైవా. అందుకే వెరైటీ రోల్ వైపు చూస్తున్నారని కోలీవుడ్ టాక్. బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ ఆ మధ్య పా సినిమాలో జెనెటిక్ డిసార్డర్ తో బాధపడే 12ఏళ్ల బాలుడిగా కనిపించి మెప్పించారు. రీసెంట్ గా పీకూతోనూ హిట్ కొట్టారు అమితాబ్. దీంతో అలాంటి ఓ వెరైటీ క్యారెక్టర్ కోసం రజనీ ట్రై చేస్తున్నారని సమాచారం. అందుకే వెరైటీ కాన్సెప్ట్స్ తో కోలీవుడ్ ని షేక్ చేసిన పా రంజిత్ కు ఏరికోరి మరీ చాన్సిచ్చారట. ఈ మూవీని కలైపులి థాను ప్రొడ్యూస్ చేయనున్నారు.

2010లో రిలీజైన రోబో తర్వాత రజనీకాంత్ అనారోగ్యానికి గురయ్యారు. చాలా రోజుల పాటు ట్రీట్ మెంట్ తీసుకోవాల్సి వచ్చింది. దీంతో దాదాపు రెండున్నరేళ్ల పాటు సినిమాలకు దూరమయ్యారు. తర్వాత ఎక్కువ స్ట్రెస్ లేకుండా కూతురు సౌందర్య డైరెక్షన్ మోషన్ క్యాప్చర్ టెక్నాలజీతో తీసిన కొచ్చాడయన్ మూవీలో యాక్ట్ చేశారు. అది ఫ్లాప్ అయింది. తర్వాత కేఎస్ రవికుమార్ డైరెక్షన్ లో లింగా మూవీ చేశారు. అదీ అంతంత మాత్రంగానే ఆడింది. పైగా సినిమాల చుట్టూ వివాదాలు రజనీని అయోమయ స్థితిలో పడేశాయి. ఇమేజ్ కూడా కొంతవరకు డ్యామేజ్ అయింది. రోబో తర్వాత ఫ్యాన్స్ తన నుంచి కొత్తదనం కోరుకుంటున్నారని తెలుసుంటున్నట్టున్నారు. అందుకే రొటీన్ స్టోరీలకు కాకుండా  కొత్తగా వెళ్లేందుకు ఫిక్సయ్యారని టాక్. పా రంజిత్ ఇప్పటిదాకా రెండు సినిమాలే చేశారు. అవి అట్టకత్తి, మద్రాస్. డిఫరెంట్ కాన్సెప్ట్స్ తో వీటిని తెరకెక్కించి హిట్ కొట్టారు పా రంజిత్. వెంటనే సూపర్ స్టార్ దృష్టిలో పడ్డారు. ఆయనతో సినిమా చేసే చాన్స్ దక్కించుకున్నారు. రజనీ-రంజిత్ కాంబినేషన్ లో రానున్న మూవీకి సంతోష్ నారాయణ్ మ్యూజిక్ అందించనున్నారు. ఇక రజనీని డైరెక్ట్ చేసే చాన్స్ రావడంపై రంజిత్ కూడా ఫుల్ ఖుషీగా ఉన్నాడట. అందుకే కథకు మెరుగులు దిద్దే పనిలో పడిపోయాడట రంజిత్. రజనీ కోరుకున్న విధంగానే వెరైటీ స్టోరీ రెడీ చేస్తున్నాడట పా రంజిత్. ఓవరాల్ గా రజనీ-రంజిత్ మూవీతో సూపర్ స్టార్ ని కొత్త రోల్ లో చూడబోతున్నారు ఫ్యాన్స్. ఈ సారి కచ్చితంగా హిట్ కొడతాడని బోలెడు ఎక్స్ పెక్టేషన్స్ పెట్టుకున్నారు అభిమానులు.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy