ఆరంభం అదిరింది : ఆస్ట్రేలియాపై భారత్ ఘన విజయం

U-19అండర్‌-19 ప్రపంచకప్‌లో యువ భారత్‌ తొలి మ్యాచ్ తోనే అదరగొట్టింది. గ్రూప్‌-బిలో మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై 100 పరుగుల తేడాతో ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. మౌంట్ మాంగనీ లో జరిగిన మ్యాచ్ లోఆస్ట్రేలియా… 42.5 ఓవర్లలోనే 228 పరుగులకు ఆలౌట్‌ అయింది. ఓపెనర్‌ ఎడ్వర్డ్‌ 73, హోల్ట్‌ 39, జొనాథన్‌ 38, మ్యాక్స్ బ్రాంట్‌ 29 పరుగులు చేయగా.. మిగతా బ్యాట్స్‌మన్‌ తక్కువ స్కోర్ కే పరిమితమయ్యారు. భారత్‌ నిర్దేశించిన 329 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో ఆసీస్‌ చేతులెత్తేసింది.

భారత బౌలర్లలో శివమ్‌ మావి, నగర్‌కోటి చెరో 3వికెట్లు తీసుకున్నారు. అభిషేక్‌ శర్మ, సుధాకర్‌ రాయ్‌ తలో వికెట్‌ తీసుకున్నారు.

అంతకు ముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్… నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 328 పరుగుల భారీ స్కోరును సాధించింది. ఓపెనర్లుగా బరిలోకి దిగిన పృథ్వీ షా(94), మన్‌జోత్‌‌(86) తమ సత్తా చాటారు. భారత బ్యాట్స్‌మెన్లలో అభిషేక్‌ శర్మ 23, రాణా 14, నగర్‌కోటి 11, శివసింగ్‌ 10, జుయల్‌ 8, రాయ్‌ 6 పరుగులు చేశారు.

ఆసీస్‌ బౌలర్లలో ఎడ్వర్డ్‌ 4 వికెట్లు పడగొట్టాడు.సుదర్‌లాండ్‌, ఉప్పల్‌, వా తలో వికెట్‌ తీశారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy