ఆరుగురికి జీవం పోసి చిరంజీవిగా నిలిచిన పాప

5 years oldచనిపోయినా జీవించి ఉండడం..ఒక్క అవయవదానం తో మాత్రమే సాధ్యం. చెన్నై లోని కరూర్ కు చెందిన ఓ చిన్నారి తాను  చనిపోయి మరో ఆరుగురికి ప్రాణదానం చేసింది. అతి చిన్న వయసులో అవయవ దానం చేసి చిరంజీవిగా నిలిచింది. ఒకటో తరగతి చదువుతున్న ఐదేళ్ల జనశృతి తల్లితో పాటు  స్కూలుకు వెళ్తూ రోడ్డు ప్రమాదానికి గురైంది. తీవ్రంగా గాయపడిన ఆమెకు స్థానిక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స అందించారు. అయినా ఫలితం లేకపోవడంతో కోవై మెడికల్ సెంటర్‌ కు తరలించారు. అక్కడ కూడా ఫలితం కన్పించకపోగా…ఆరోగ్యం మరింత విషమించింది. చివరకు చికిత్సకు చిన్నారి స్పందించకపోవడంతో బ్రెయిన్ డెడ్‌గా బుధవారం ఉదయం డాక్టర్లు  డిసైడ్ చేశారు. తమ ముద్దులబిడ్డ అకాలమరణంతో పుట్టెడు శోకంలో మునిగిపోయినా ఆమె తల్లిదండ్రులు పెద్ద మనసు చేసుకున్నారు. తమ చిన్నారి అవయవాలను దానం చేయడానికి ముందుకొచ్చారు. దీంతో చిన్నారి రెండు కిడ్నీలు, లివర్, హార్ట్ వాల్వ్ ను డాక్టర్లు సేకరించారు. తర్వాత రెండు కళ్లను స్థానిక అరవింద్ కంటి ఆసుపత్రికి దానం చేశారు. మిలిగిన అవయవాలను ప్రత్యేకవిమానంలో వివిధ ఆస్పత్రులకు తరలించిన ప్రత్యేక వైద్య బృందం వాటిని అవసరమైన  రోగులకు అమర్చింది.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy