ఆరు నెలల్లో ఎన్నికలు జరుగుతాయి: రజత్ కుమార్

రాష్ట్ర ఎన్నికలపై దృష్టిపెట్టింది ఎలక్షన్ కమిషన్. నిబంధనల ప్రకారం ఆరు నెలల్లో ఎన్నికలు జరుగుతాయన్నారు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్. ఎలక్షన్ కోసం ఏర్పాట్లు చేయాల్సి ఉందన్నారు. ఈ నెల 18 వరకు రాష్ట్రానికి ఈవీఎంలు వస్తాయన్నారు. ఈ సారి ఎన్నికల్లో వీవీప్యాట్ ఈవీఎంలు ప్రవేశపెట్టబోతున్నట్టు తెలిపారు.  ఎన్నికల కోడ్ వచ్చాక రైతుబంధు పథకం అమలు చేయాలా వద్దా అన్నది కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్తామన్నారు CEO.

ఈ నెల 24 నుంచి అధికారులకు ప్రత్యేక ట్రైనింగ్ ఇస్తామన్నారు రజత్ కుమార్. ఓటర్ లిస్టులతో పోలింగ్ బూత్ ల వారీగా విభజన జరుగుతుందన్నారు. రేపు, ఎల్లుండి గ్రామస్థాయిలో పోలింగ్ బూత్ ల వారీగా అభ్యంతరాలను స్వీకరించి పరిష్కరిస్తామని చెప్పారు.  ఓటర్లను చైతన్యం చేసేందుకు కలెక్టర్లు, ఇతర అధికారులు ప్రయత్నిస్తున్నారని చెప్పారు. ఈవీఎంలు రాగానే.. అన్ని పార్టీలను పిలిచి.. వాటి పనితీరును వివరిస్తామని.. ఈవీఎంలపై ఎలాంటి అపోహలు పెట్టుకోవదన్నారు రజత్ కుమార్..

న్యాయస్థానాల్లో 37 కేసులు వేసినా ఈవీఎంలపై అనుకూలంగానే నిర్ణయం వచ్చిందని తెలిపారు. ఎన్నికల కమిషన్ పూర్తి పారదర్శకంగా పనిచేస్తుందన్నారు. సమస్యలు వచ్చిన చోట.. వెంటనే పరిష్కరించేలా.. ఈవీఎం ట్రాకింగ్ టెక్నాలజీ కూడా అందుబాటులో ఉందని తెలిపారు.

ముందస్తు ఎన్నికలతో పార్టీల అభ్యర్థులు పంపిణీ చేసే నగదుపై నిఘా పెడుతామన్నారు రజత్ కుమార్. సోషల్ మీడియాలో ఎన్నికల ప్రచారంపై వచ్చే కథనాలపై కూడా ప్రత్యేక నిఘా ఉంచుతామన్నారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy