ఆరోగ్యంతో ఆటలా : పెద్ద హోటళ్లంటే జనం బెంబేలు

హైదరాబాద్‌ , వెలుగు: అదో పెద్ద ఫేమస్ హోటల్‌. సిటీకి చాలామంది ఆ హోటల్‌ లో బిర్యానీ రుచి చూడాలనుకుంటారు. సరదాగా మిత్రులు కలిసినా, సాయంకాలం ఫ్యామిలీతో బయటికి వెళ్లి భోజనం చేయాలనుకున్నా గుర్తొచ్చే పేరు. కానీ.. ఆ హోటల్‌ లో పైపై మెరుగులే తప్ప లోపలంతా లొటారమే. ఎక్కడ చూసినా ఆహార వ్యర్థాల కుప్పలు. కిచెన్‌ లో సరైన క్లీనింగ్ ఉండదు. సొంత కంపోస్ట్‌ సిస్టమ్‌ కనపడదు.

సిటీలో స్వచ్ఛతకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తూ తనిఖీలు చేపడుతున్న GHMC అధికారులు బడా హోటళ్ల బండారం గుట్టువిప్పి బజారున పడేస్తున్నారు. అధికారులు నిర్వహిస్తున్న తనిఖీలు తమ హోటల్‌ దాకా ఎక్కడ వస్తాయో అనే ఆందోళన హోటల్‌ యజమానుల్లో ఉంది. తమ ఫేవరెట్‌ హోటళ్ల పేరు వింటున్న జనంలోనూ అంతే ఆందోళన కనిపిస్తోంది. ప్రముఖ హోటళ్లే ఇట్లుంటే.. ప్రజల ఆరోగ్య పరిరక్షణ, పారిశుద్ధ్య నిర్వహణపై GHMC సీరియస్‌‌‌‌గా యాక్షన్‌ తీసుకుంటోంది. రోజువారీ తనిఖీలు కొనసాగిస్తోంది. హోటళ్లలో ఆహార పదార్థాల నాణ్యత, పరిశుభ్రంగా లేకుంటే ఫైన్ విధిస్తోంది. పరిస్థితి మరీ తీవ్రంగా ఉంటే హోటల్‌, రెస్టారెంట్లను సీజ్‌ చేస్తోంది.

సిటీలో పేరుమోసిన ఆర్టీసీ క్రాస్‌‌‌‌ రోడ్‌ బావర్చీని అధికారులు మూసివేశారు. హోటల్‌ లో ఆహార వ్యర్థాలు అస్తవ్యస్తంగా ఉండడంతో అధికారులు ఈ మేరకు చర్యలు తీసుకున్నారు. మూసాపేట్‌ లోని దేవి గ్రాండ్‌ లో డిప్యూటీ కమిషనర్‌ మమత ఆధ్వర్యంలో వైద్యాధికారులు, వెటర్నరీ అధికారులు జనవరి-7న తనిఖీలు చేశారు. వంట గదిలో అపరిశుభ్రంగా నిల్వచేసిన ఆహారం, నాణ్యత లేని మాంసం ఎక్కడపడితే అక్కడ పడేసిన ఆహార వ్యర్థాలు, పైపు నుంచి మురుగు నీరు లీకేజీ గుర్తించారు.

బాధ్యులైన యజమానులకు రూ.30 వేలు ఫైన్‌ వేశారు. కూకట్‌ పల్లి నిజాంపేట్‌ రోడ్డులోని సహారా కేఫ్‌ అండ్‌ రెస్టారెం ట్‌ లోనూ అధికారులు తనిఖీలు చేశారు. పరిశుభ్రంత లేకపోవడంతో హోటల్‌ ను సీజ్‌ చేశారు. త్రిపుర బార్‌ అండ్‌ రెస్టారెం ట్‌ లోనూ తనిఖీ చేసి రూ.20 వేలు జరిమానా విధించారు. రూల్స్‌ పాటించకుంటే ఎవరిని వదలమని తెలిపారు అధికారులు.

 

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy