ఆరోగ్యంపై శ్రద్ధ పెరుగుతోంది : సిటీలో ఆర్గానిక్ పుడ్ కు పెరుగుతున్న క్రేజ్

ORGANICసిటీ జనానికి ఆరోగ్యంపై శ్రద్ధ పెరుగుతోంది.  అందుకే ఆర్గానిక్ ఫుడ్స్ వైపు మొగ్గు చూపుతున్నారు. దీంతో నేచురల్ ఫుడ్ ఐటమ్స్ కి క్రేజ్ పెరుగుతోంది. హోటల్స్ కూడా సీజనల్ ఫుడ్ ఐటమ్స్ అందిస్తూ అందరిని ఆకట్టుకుంటున్నాయి.

బిజీలైఫ్ లో కూడా ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇస్తూ సేంద్రీయ ఆహారంపై వైపు మొగ్గు చూపుతున్నారు చాలామంది సిటిజన్స్.  కెమికల్ ఫుడ్స్ తో వచ్చే అనారోగ్య సమస్యల నుంచి బయటపడాలంటే ఆర్గానిక్ ఫుడ్స్ అలవాటు చేసుకోవడం మంచిదంటున్నారు. రేటు కాస్త ఎక్కువైనా సేంద్రీయ ఆహారం తినాలని సూచిస్తున్నారు. కొన్ని హోటల్స్, రెస్టారెంట్లు కూడా నేచురల్, ఆర్గానిక్ ఐటమ్స్ అందిస్తూ కస్టమర్లను ఆకట్టుకుంటున్నాయి. ఇప్పుడు వేసవికాలం కావడంతో ఫ్రూట్ జూస్ ఐటమ్స్ తో పాటు డిఫరెంట్ ఫ్రూట్ ఫ్లేవర్స్ తో ఐస్ క్రీమ్స్, మాక్ టైల్స్ ను అందిస్తున్నారు.

 

కొన్నాళ్లుగా ఆర్గానిక్ ఫుడ్స్ కి ఇంపార్టెన్స్ పెరిగిందంటున్నారు జనం. పాత కాలంలో ఉపయోగించిన మట్టి పాత్రల్లోనే వంట చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. సిటీ జనం ఎక్కువగా హెర్బల్, ఆర్గానిక్ ఫుడ్ ఐటమ్స్ కొంటున్నారని చెబుతున్నారు వ్యాపారులు. అందుకే బ్యూటీ నుంచి చాక్లెట్ వరకూ అన్నిరకాల ఉత్పత్తులు సేంద్రీయంగా తయారుచేసినవే అమ్ముతున్నట్టు చెబుతున్నారు. ఆరోగ్యంగా ఉండాలంటే నేచురల్, ఎకో ఫ్రెండ్రీ లైఫ్ స్టైల్ ను ఫాలో అవ్వాలంటున్నారు హెల్త్ ఎక్స్ పర్ట్స్. రేటు కాస్త ఎక్కువైనా… సేంద్రీయ ఆహారం తినాలని సూచిస్తున్నారు.

 

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy