
నవ్వడం వల్ల శారీరక ఆరోగ్యం బాగుండటమే కాదు, మానసికంగా కూడా మంచిదట. జ్ఞాపకశక్తి కూడా నవ్వడం వల్ల పెరుగుతుంది. నిద్రపోయేటప్పుడు ఎంత హాయి కలుగుతుందో ఎక్కువగా నవ్వితే అంతే హాయి కలుగుతుందని పరిశోధనలో తేలింది. ఒత్తిడి, కోపం, ద్వేషం, భయం…. లాంటివన్నీనవ్వడం వల్ల పోతాయి. కావాలని నవ్వే నవ్వుకు, మనస్ఫూర్తిగా వచ్చే నవ్వుకు తేడాలుంటాయి. కావాలని నవ్వే నవ్వును ఎదుటి వాళ్లు ఇట్టే కనిపెట్టేస్తారు. మెదడుకు కూడా తెలిసిపోతుంది. నవ్వడం కోసం కామెడీ సినిమాలు, వీడియోలు చూడాలి. చిన్న పిల్లలు చేసే అల్లరి కూడా ఒక్కోసారి నవ్వు తెప్పిస్తుంది. ఈ మధ్యకాలంలో నగరాల్లో లాఫింగ్ క్లబ్ లు పెరిగిపోతున్నాయి. రోగనిరోధక శక్తి కూడా నవ్వడం వల్ల పెరుగుతుందని వైద్యులు చెప్తున్నారు.