ఆరోగ్యశ్రీతో సర్కారీ దవాఖానాలకు ఆదాయం

Arogyasri-Health-Trustగవర్నమెంట్ హాస్పిటల్స్ ను నిధులతో బలోపేతం చేసేందుకు ప్రయత్నిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. ఆరోగ్యశ్రీ కింద కేటాయిస్తున్న నిధులు ప్రభుత్వ ఆస్పత్రులకు కూడా అందేలా ప్లాన్ చేస్తోంది. సుమారు 700 రకాల చికిత్సలను ప్రభుత్వ ఆస్పత్రులకే పరిమితం చేయాలని డిసైడైంది.

రాష్ట్రంలో ఇప్పటి వరకు ఆరోగ్య శ్రీ నిధులు 30 శాతం మాత్రమే ప్రభుత్వ ఆస్పత్రులకు వెళ్తున్నాయి. మిగిలిన 70 శాతం నిధులు ప్రైవేట్ ఆస్పత్రుల సొంతమవుతున్నాయి. దీనిపై వస్తున్న విమర్శలకు చెక్ పెట్టే ప్రయత్నం చేస్తోంది ప్రభుత్వం. ఆరోగ్య శ్రీ చికిత్సలను ప్రభుత్వ ఆస్పత్రుల్లోనూ సమర్థంగా నిర్వహించాలని భావిస్తోంది. సుమారు 700  రకాల చికిత్సలను కేవలం ప్రభుత్వ ఆస్పత్రులకే పరిమితం చేయాలని నిర్ణయించింది.

ఉదయం వచ్చి సాయంత్రం వెళ్లిపోయేలా ఉండే చికిత్సలు, ఒకట్రెండు రోజులు ఆస్పత్రుల్లో ఉండి వెళ్లి పోయే చికిత్సలను ఇకపై ప్రభుత్వ ఆస్పత్రులకే పరిమితం చేయనున్నారు. ఆరోగ్య శ్రీ కింద ప్రస్తుతం 942 రకాల రోగాలకు ట్రీట్ మెంట్ చేస్తున్నారు. ఇందులో 133 చికిత్సలను ఇప్పటికే ప్రభుత్వ ఆస్పత్రులకు మాత్రమే పరిమితం చేశారు. అసంఘటిత కార్మికులకు ఆరోగ్య బీమాను అందించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన …. రాష్ట్రీయ స్వస్థ్య బీమా యోజన – RSBY పథకాన్ని ఇటీవల ఆరోగ్యశ్రీ పథకం పరిధిలోకి తీసుకువచ్చారు. దీంతో 700  కొత్త చికిత్సలు ఆరోగ్య శ్రీ పథకం పరిధిలోకి వచ్చాయి. వీటిని ప్రభుత్వ ఆస్పత్రులకు మాత్రమే పరిమితం చేశారు. స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ చికిత్సలు కూడా ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లోనూ ట్రీట్ మెంట్ తీసుకోవచ్చు.

ఇక RSBY అమలుతో కేంద్రం నుంచి ప్రతి యేటా 100 కోట్ల రూపాయల నిధులు వచ్చే అవకాశముంది. ఆరోగ్య శ్రీ పరధిలోకి ఎక్కువ ట్రీట్ మెంట్స్  రావడంతో ప్రభుత్వ డాక్టర్లు, సిబ్బందికి ఎక్కువ ఇన్సెంటివ్స్ అందుతాయి. హెర్నియా, హైడ్రోసీల్, ఫిషర్స్, ఫిస్టులా, పైల్స్…. తదితర చికిత్సలు ప్రభుత్వ ఆస్పత్రులకే పరిమితం అవుతాయి. ఆస్పత్రుల స్థాయి, అక్కడ లభించే వైద్య సౌకర్యాలను బట్టి ఆస్పత్రుల వారీగా చికిత్సలను కేటాయిస్తారు. దీని ద్వారా గవర్నమెంట్ హాస్పిటల్స్ కూడా నిధులతో బలోపేతం అవుతాయని ప్రభుత్వం భావిస్తోంది.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy