ఆర్కే నగర్ ఉప ఎన్నిక రద్దు!

election-commissionతమిళనాడు రాష్ట్రంలో దివంగత జయలలిత నియోజకవర్గం రాధాకృష్ణ నగర్ లో(ఆర్ కె పురం)లో జరగాల్సిన ఉపఎన్నిక రద్దయ్యే అవకాశం ఉందంటున్నారు అధికారులు. పెద్ద మొత్తంలో ఓటుకు నోట్లు పంచుతున్నారన్న సమాచారంతో ఇన్ కమ్ ట్యాక్స్ అధికారులు జరిపిన రైడ్ చేశారు. ఈ ఐటీ దాడులలో ఆసక్తికర విషయాలు బయట పడ్డాయి. ప్రజలకు పంచేందుకు కోట్ల రూపాయలను సిద్ధం చేయగా బయట పడ్డారు.

శశికళ వర్గం రూ. 89 కోట్లు పంచేందుకు ప్రయత్నించినట్టు తెలిసింది. నటుడు శరత్ కుమార్, హెల్త్ మినిష్టర్ విజయ్ భాస్కర్ ఇళ్లలో ఇటీవల ఐటీ సోదాలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ నెల 12న జ‌ర‌గాల్సిన ఉప ఎన్నిక‌ను రద్దు చేసే దిశగా ఎన్నిక‌ల సంఘం ఆలోచిస్తున్నట్టు సమాచారం. ఐటీ రిపోర్ట్ రాగానే దీనిపై చర్యలు తీసుకొనే అవకాశం ఉంది. శ‌శిక‌ళ వ‌ర్గం అభ్య‌ర్థి దిన‌క‌ర‌న్‌కు ఓటు వేయాల్సిందిగా ఓట‌ర్ల‌కు ఒక్కొక్కరీకీ రూ. 4 వేలు పంచాలన్న ప్రణాళికా పత్రాలు దాడుల సంద‌ర్భంగా ఐటీ అధికారులు దొరికాయ్. స్వయంగా ఓ మంత్రి ఇంట్లో దొరకడం.. అందులో సీఎం పళనీ స్వామీ పేరు కూడా ఉండడంతో ఈ ఎన్నికలను రద్దు చేసేందుకు ఎలక్షణ్ కమిసన్ అభిప్రాయపడుతోంది.

 

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy