ఆర్టికల్ 370పై రేగుతున్న చిచ్చు…

jitender_singh_360x270ఆర్టికల్ 370 మీద ప్రధాని కార్యాలయం వ్యవహారాల మంత్రి జితేందర్ సింగ్ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. కాశ్మీర్ లో చాలా వర్గాలు ఆర్టికల్ 370 రద్దును కోరుకుంటున్నాయని జితేంద్రసింగ్ చెప్పడం, . దేశంలో అన్ని రాష్ట్రాలకు అందుతున్న ప్రయోజనాలను ఈ ఆర్టికల్ వల్లే కాశ్మీర్ యువత అందుకోలేకపోతోందని అన్నారు. ఆర్టికల్ రద్దుపై యువతను ఒప్పించే ప్రయత్నం చేస్తామనడం…అనవసర రాద్ధాంతాలకు తెరతీసింది. దీనిపై నేషనల్ కాన్ఫరెన్స్, పీడిపి నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యాఖ్యలపై ప్రధాని నరేంద్రమోడీ సమాధానం చెప్పాలని పట్టుబడుతున్నారు ఒమర్ అబ్దుల్లా, మఫ్తి.
ఆర్టికల్ 370పై తాను చేసిన వ్యాఖ్యలకు జితేంద్ర సింగ్ ఈరోజు సంజాయిషీ చెప్పుకున్నారు. అది తాను పొరపాటున అనేశానని…దానిపై వస్తున్న కాంట్రవర్శీలు పూర్తిగా బేస్ లేస్ అని క్లారిఫికేషన్ ఇచ్చుకున్నారు. అయితే జిత్రేంద్ర సింగ్ ఇచ్చుకున్న సంజాయిషీ సరిపోదంటున్నారు నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా, పిడిపి నేత మెహబూబా మఫ్తి. జితేంద్ర సింగ్ కన్నా పైవారు ఈ కాంట్రవర్శీకి సమాధానం చెప్తేగాని వీలు లేదని డిమాండ్ చేస్తున్నారు. ఆర్టికల్ 370 లో ఎటువంటి మార్పులు జరగవని జమ్మూ-కాశ్మీర్ ప్రజలకు హామీ ఇవ్వాలని పట్టుబడుతున్నారు.
ఆర్టికల్ 370. కాశ్మీర్ స్వయంప్రతిపత్తికి రాజ్యాంగం ఇచ్చిన హామీ. దేశ విభజన సమయంలో… భారత్ లో విలీనం కావడానికి కాశ్మీర్ రాజుతో జరిగిన ఒప్పందం ప్రకారం భారత రాజ్యాంగంలో స్వయం ప్రతిపత్తి కల్పించారు. అంటే… కాశ్మీర్ లో రక్షణ, అంతర్గత భద్రత, విదేశాంగ విధానం, టెలికమ్యూనికేషన్లు లాంటి కీలక అంశాల్లో తప్పితే.. మిగతా ఏ అంశాల్లోనూ కేంద్రం వేలుపెట్టడానికి వీల్లేదు. పథకాలు.. చట్టాల రూపకల్పనలో సొంతంగా వ్యవహరించే అధికారం కాశ్మీర్ ప్రభుత్వానికుంది. అన్ని అంశాల్లో మిగతా రాష్ట్రాలపై అజమాయిషీ చెలాయించే కేంద్రం… కాశ్మీర్ విషయానికి వచ్చేసరికి మాత్రం చేతులు ముడుచుకోవాల్సిందే.
అప్పట్లో కాశ్మీర్ ప్రయోజనాల కోసమే స్వయం ప్రతిపత్తి కల్పించినా… ఉగ్రవాదం కారణంగా అశాంతి, జనంలో అభద్రత పెరిగిపోయాయని బీజేపీ మొదటినుంచి చెబుతూ వస్తోంది. ఉద్యోగాలు దొరక్క యువత ఇబ్బందిపడుతున్నారని అంటోంది. ప్రపంచమంతా ముందడుగు వేస్తున్నా… కాశ్మీర్ అభివృద్ధిలో వెనుకబడిపోతోందని అంటోంది. అటు పాకిస్థాన్… ఇటు చైనా.. కవ్వింపులతో అనివార్యంగా రక్షణపై ఎక్కువగా దృష్టిపెట్టాల్సి వస్తోంది. ఉగ్రవాద సమస్య వల్ల భద్రత పెంచుతున్నారు. దీంతో పౌరహక్కులు దెబ్బతింటున్నాయన్న విమర్శలు పెరుగుతున్నాయి. స్థానిక ప్రభుత్వం కూడా సమస్యలపై సరైన రీతిలో స్పందించడం లేదనే భావన జనంలో ఉంది. అందుకే.. ఎన్నికల మేనిఫెస్టోలో కాశ్మీర్ స్వయం ప్రతిపత్తి అంశాన్ని రద్దుచేస్తామని బీజేపీ చెప్పింది. పవర్ లోకి వచ్చిన ఫస్ట్ డేనే ఈ అంశాన్ని తెరపైకి తెచ్చింది.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy