ఆర్టీవో అధికారులు చంబల్ బందిపోటు దొంగలను మించిపోయారు

gadkari-cabinetఅవినీతిలో దేశం ఏప్లేస్ లో ఉందంటే పెద్దగా ఆలోచించకుండానే ఆన్సర్ చెప్పేస్తాం.. ఎందుకంటే ఎక్కడ చూసినా అదే కనిపిస్తుంది కాబట్టి. మరి ఏ డిపార్ట్ మెంట్ లో అవినీతి ఎక్కువ..?  ఈ క్వశ్చన్ కి కరెక్ట్ ఆన్సర్ తాను చెబుతా అంటున్నారు కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ. రవాణశాఖలో జరిగేంత అవినీతి దేశంలో ఏ డిపార్ట్ మెంట్ లో జరగదని కుండబద్దలు కొట్టారు. రీజినల్ ట్రాన్స్ పోర్ట్ ఆఫీసుల్లో అవినీతి విపరీతంగా ఉందని.. అక్కడి అవినీతిపరులు చంబల్ లోయ బందిపోట్లను మించిపోయారని తీవ్ర స్థాయిలో విమర్శించారు. ఓ జాతీయ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయనీ వ్యాఖ్యలు చేశారు. రోడ్ ట్రాన్స్ పోర్టు అండ్ సేఫ్టీ బిల్ తోనే ఈ అవినీతిని అంతమొందిచవచ్చంటున్నారు నితిన్.

Comments are closed.

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy