ఆర్టీసీలోకి కొత్త బస్సులు

new-busesప్రయాణికులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు ప్రణాళికలు సిద్దం చేస్తోంది ఆర్టీసీ. కాలం చెల్లిన బస్సులను పక్కన పెట్టి.. కొత్త బస్సులు కొనేందుకు సిద్దమౌతోంది. ఇప్పటి వరకు సర్వీసు లేని ఏరియాల్లో కూడా బస్సు సౌకర్యం కల్పించేందుకు ప్లాన్ చేస్తున్నారు ఆర్టీసి అధికారులు.

వచ్చే ఏడాదిలోగా 1100 కొత్త బస్సులు కొనేందుకు సిద్ధమౌతున్నారు ఆర్టీసీ అధికారులు. రాష్ట్ర వ్యాప్తంగా 10,500 బస్సులు తిరుగుతుండగా… ఇందులో వచ్చే ఏడాది మార్చి వరకు నిబంధనల ప్రకారం 15 సంవత్సరాలు పూర్తయి…. 13 లక్షల కిలోమీటర్లు తిరిగిన బస్సులు 800 ఉండే అవకాశం ఉంది. గ్రేటర్ పరిధిలో 185 బస్సులు పక్కన పెట్టనున్నారు. వీటి స్థానంలో  కొత్త  బస్సులు పెట్టేందుకు ప్లాన్ చేస్తున్నారు ఆర్టీసి అధికారులు. గతేడాది కొనుగోలు చేసిన వాటిలో ఇంకా రావాల్సినవి 180 బస్సులతో పాటు అదనంగా మరో 1100 బస్సులు కొనేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. 2018 మార్చి వరకు ఇవి అందుబాటులోకి తెచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు.

గతేడాది 350 కోట్లలో 1400 బస్సులను కొనుగోలు చేశారు. ఈసారి మొత్తం 1100 బస్సులకు 300 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేస్తున్నారు. ఇందులో 130 కోట్లు ప్రభుత్వం ఇస్తుండగా..  మిగతా డబ్బును కార్పొరేషన్ నుంచి ఖర్చు చేయనున్నట్లు అధికారులు చెబుతున్నారు.

కొత్తగా కొనుగోలు చేసే వాటిలో 25 గరుడ, 58 రాజధాని ఎక్స్ ప్రెస్ లు, 390 సూపర్ లగ్జరీ బస్సులు, 85 మినీ పల్లెవెలుగు బస్సులు ఉంటాయంటున్నారు అధికారులు. బస్సు సౌకర్యం లేని గ్రామాలకు 200 బస్సులు వేయాలనే ఆలోచన చేస్తున్నామంటున్నారు.

ఆర్టీసీని బలోపేతం చేయడంతో పాటు….ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు అందించాలనే ఉద్దేశంతోనే కొత్త బస్సుల కొనుగోలు అంటున్నారు ఆర్టీసీ అధికారులు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy