ఆర్టీసీ కార్మికుల నోటీస్ : 21వ తేదీ తర్వాత సమ్మె

tsrtc

ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగింది. ఈనెల 21వ తేదీ తర్వాత ఎప్పుడైనా సమ్మెకు దిగుతామని టీఎంయూ ఆధ్వర్యంలో యాజమాన్యానికి నోటీసులిచ్చారు కార్మికులు. చీటికీమాటికీ ఉద్యోగులు, కార్మికులపై కేసులు పెట్టడం సరికాదన్నారు టీఎంయూ నేత అశ్వద్ధామరెడ్డి. డిపో నష్టాల్లో ఉంటే మేనేజర్లకు మెమోలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. మే 7వ తేదీ సోమవారం ఉదయం హైదరాబాద్ లోని బస్ భవన్ ను ముట్టడించిన కార్మికులు ఆందోళనకు దిగారు. టెంట్లు వేసుకుని నిరసన తెలిపారు. ఆర్టీసీ సంస్థలో స్టాఫ్ తక్కువగా ఉండటంతో పని భారం ఎక్కువ అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.

సమస్యలు పరిష్కరిష్కారంలో శాంతియుతంగానే ఉన్నాం అని.. ఇప్పుడు సహనం కోల్పోవడంతో ప్రభుత్వంపై పోరాటం చేయక తప్పడం లేదన్నారు. తెలంగాణ ఫలాలు ఆర్టీసీ కార్మికులకు అందటం లేదన్నారు. రాష్ట్రంలో ప్రైవేట్ ట్రావెల్స్ ఆగడాలు పెరిగిపోయాయి అని.. నియంత్రించాల్సిన అవసరం ఉందన్నారు. ఆర్టీసీలో ఎందుకు ఉద్యోగ భద్రత లేదని ప్రశ్నించారు. ప్రైవేట్ ట్రావెల్స్ ను అరికడితే ఆర్టీసీకి.. ఏడాదికి వెయ్యి కోట్ల ఆదాయం పెరుగుతుందన్నారు. GHMC నుంచి ఆర్టీసీకి రావాల్సిన నిధులు ఎందుకు విడుదల కావటం లేదని ప్రశ్నించారు. ప్రస్తుతం చేస్తున్న ఈ ధర్నా హెచ్చరిక మాత్రమేనని.. దీన్ని ప్రగతి భవన్ ముట్టడి వరకు రాకుండా చూసుకోవాలని సూచించారు. సమస్యలకు పరిష్కారం చూపకపోతే  ఈ నెల 21 తర్వాత ఎప్పుడైనా ఆర్టీసీ కార్మికులు సమ్మె చేసే అవకాశం ఉందని హెచ్చరించారు అశ్వద్ధామరెడ్డి.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy