ఆర్థిక ఇబ్బందులు: ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య


ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ దారుణ ఘటన హర్యానాలోని సూరజ్ కుంద్ ప్రాంతంలో జరిగింది. ఆత్మహత్యకు పాల్పడిన వారంతా ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్నారు. గది నుంచి దుర్వాసన రావడంతో స్థానికంగా ఉంటున్న ఓ వ్యక్తికి అనుమానం వచ్చింది. వెంటనే చుట్టుపక్కల వారిని పిలువగా వారంతా వచ్చి తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్లారు. రెండు గదుల్లో నలుగురు ఉరి వేసుకుని చనిపోయి కన్పించారు.

ఘటనా స్థలంలో ఆర్థిక ఇబ్బందులతోనే తామంతా చనిపోతున్నట్లు సూసెడ్ నోట్‌ రాసి ఉంది. అయితే వీరంతా మూడు రోజుల క్రితమే ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. చనిపోయిన వారిలో ముగ్గురు అక్కాచెల్లెళ్లు ఒక సోదరుడు ఉన్నారు. వీరందరి వయస్సు 37 ఏళ్ల నుంచి 52 ఏళ్ల మధ్య ఉంటుందని పోలీసులు తెలిపారు. వీరంతా అవివాహితులే. ఇందులో మీనా మాథ్యూ వయస్సు 52 ఏళ్లుండగా… మిగతా ఇద్దరి వయస్సు నీనా 51 ఏళ్లు, జయ 49 ఏళ్లుగా గుర్తించారు. మరోవైపు సోదరుడు ప్రదీప్ వయస్సు 37 ఏళ్లుగా పోలీసులు గుర్తించారు.

ఆర్థిక ఇబ్బందులు, పేదరికంతోనే ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని స్థానికులు తెలిపారు. చనిపోయిన వారిలో ఒక మహిళ కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతోందని డయాలసిస్ చేసుకునేందుకు వారి దగ్గర డబ్బులు లేవని చెప్పారు. వీరి తల్లిదండ్రులు ఇద్దరు కొన్ని నెలల క్రితమే చనిపోయినట్లు స్థానికులు చెప్పారు. తల్లిదండ్రులిద్దరూ హర్యానా ప్రభుత్వ ఉద్యోగాలు చేసి… రిటైర్ అయినట్లు చెప్పారు.

ఢిల్లీలోని బురారీ సామూహిక ఆత్మహత్య ఘటన మరువక ముందే హర్యానాలో మరో ఘటన జరగటం…కలకలం సృష్టిస్తోంది.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy