ఆర్మీ విమానం కూలి 16 మంది మృతి

armyఆర్మీ విమానం కూలడంతో ఫ్లైట్ లోని 16 మంది సజీవదహనమయ్యారు.  అమెరికాలోని లేఫ్లోర్ కౌంటీలో ఈ ప్ర‌మాదం సంభ‌వించింది. మెరైన్ పోలీసుల‌కు సంబంధించిన విమానంలో మొత్తం 16 మంది ఉన్నారు. వేగంగా ఉన్న విమానం ఒక్కసారిగా కింద పడటంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో.. ఈ ప్ర‌మాద ఒక్క‌రు కూడా బ్ర‌త‌క‌లేదు. విమాన ప్ర‌మాదం ఎలా జ‌రిగింద‌న్న దానిపై ఇంత వ‌ర‌కు ఎటువంటి స‌మాచారం లేదు. అమెరికా మెరైన్స్‌కు చెందిన కేసీ-130 హెర్క్యూల్స్ ట్రాన్స్‌పోర్ట్ విమానం ఈ ప్ర‌మాదంలో పూర్తిగా ధ్వంస‌మైంది. దాని శిథిలాల‌ను పోలీసులు గుర్తించారు. ఇదో విషాద‌క‌ర సంఘ‌ట‌న అని మిసిసిపీ గ‌వ‌ర్న‌ర్ ఫిల్ బ్రాంట్ తెలిపారు.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy