ఆలయంలోకి నగ్నంగానే అఘోరాలు : ఆందోళనలో భక్తులు

71500158236_625x300అఘోరాలను చూస్తేనే ఆమడ దూరంలో ఉండే సామాన్య ప్రజలు  ఏకంగా నగ్నంగా ఉన్న అఘోరాలు ఆలయంలోకి ప్రవేశించడంతో భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సంఘటన చెన్నైలో జరిగింది. ఆగమ శాస్త్రాలకు విరుద్ధంగా చెన్నై నగరంలోని శ్రీవారి ఆలయంలోకి అఘోరాల రాక వార్తలు తమిళనాట కలకలం రేపాయి. చెన్నై తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) మాజీ సభ్యుడు సత్యనారా యణరావు, తమిళనాడు బీజేపీ ప్రోటోకాల్‌ ప్రతినిధి శంకర్‌ కలిసి శుక్రవారం(జూలై-14)  నలుగురు అఘోరాలను శ్రీవారి ఆలయం సందర్శనకు తీసుకొ చ్చారు. వీరిలో ఒకరు పూర్తి నగ్నంగా ఉండగా మిగిలిన ముగ్గురు కొద్దిగా వస్త్రాలు ధరించారు. శ్రీవారి ఆలయ ఆగమ శాస్త్రాల ప్రకారం నగ్నస్వాముల దర్శనానికి అనుమతి లేదు.
స్థానిక సలహా మండలి చైర్మన్, వైస్‌చైర్మన్, ఇతర సభ్యులు శుక్రవారం(జూలై-14) రాత్రి రాజ్‌భవన్‌కు వెళ్లిన సమయంలో ఓ ప్రస్తుత సభ్యుడు, మరో మాజీ సభ్యుడు కలసి అఘోరాలకు శ్రీవారి దర్శన భాగ్యం కల్పించారు. సభ్యులే వెంటపెట్టుకుని రావడంతో ఆలయ నిబంధనలకు విరుద్ధమైనా అర్చకులు వారి పేరిట ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. దీంతో శ్రీవారి ఆలయం అపవిత్రమైందని ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో ఆదివారం జరిగే ఆణివార ఆస్థాన కార్యక్రమంలో భాగంగా శ్రీవారి ఆలయ శుద్ధి కోసం శనివారం కొద్ది సేపు ఆలయాన్ని మూసివేశారు. అయితే ఆలయ మూసివేత ఏటా సహజంగా జరిగే ప్రక్రియని స్థానిక సలహా మండలి వివరణ ఇచ్చింది. ఆదివారం యథావిధిగా శ్రీవారి సేవలు సాగుతాయని చెప్పారు.  అఘోరాలు వెళ్లిన తర్వాత ఆలయాన్ని శుద్ధిచేసి, అధికారులు చేతులు దులుపుకున్నట్లు సమాచారం.  అయితే అఘోరాలను ఆగమశాస్త్రానికి విరుద్ధంగా తెచ్చారంటూ భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy