ఆలయ పాలకుల సంఖ్య పెంపు

photo-cmsMSID16167835రాష్ట్రంలో దేవాలయాల పాలకమండళ్ల సభ్యుల సంఖ్య పెరగనుంది. కోటి ఆదాయం దాటిన అన్ని దేవాలయాల్లోనూ సభ్యుల సంఖ్య పెంచేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. అవసరమైతే చట్టసవరణకూ రెడీ అంటోంది సర్కార్. ఇప్పటికే దీనిపై సీరియస్ గా దృష్టిపెట్టినట్లుగా సమాచారం. ప్రస్తుతం కోటికి పైగా ఆదాయం ఉన్న పాలకమండళ్లలో.. తొమ్మిది మందినే నియమించాలని చట్టం చెబుతోంది. ప్రభుత్వ తాజా నిర్ణయంతో.. పాలకమండలి సభ్యుల సంఖ్య 11 లేదా 14కు పెరగనుంది.

అధికారుల రిపోర్ట్ ఇదీ

రెండు, మూడేళ్లుగా రాష్ట్రంలోని ఆలయాల ఆదాయం పెరిగినట్లు దేవాదాయశాఖ అధికారులు ప్రభుత్వానికి రిపోర్ట్ ఇచ్చారు. సికింద్రాబాద్ లోని గణపతి దేవాలయం,  ఉజ్జయిని మహంకాళి దేవస్థానం, కర్మన్ ఘాట్ శ్రీ వీరాంజనేయస్వామి దేవాలయం, కొండగట్టు ఆంజనేయస్వామి, కొమురెల్లి మల్లన్న, వరంగల్ భద్రకాళి ఆలయాల ఆదాయం పెరిగిందని అధికారుల నివేదికలు చెబుతున్నాయి. దేవాదాయశాఖ రిపోర్ట్ పై అధ్యయనం చేశాక పాలకమండళ్ల సభ్యుల సంఖ్య పెంచాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం అవసరమైతే చట్టాన్ని సవరించేందుకు కూడా ప్రభుత్వం సిద్ధమవుతోంది. చట్టం ప్రకారం దేవాలయాలకు పాలకమండళ్లను మూడు స్థాయిల్లో నియమిస్తారు. 25లక్షల లోపు ఆదాయం ఉన్న వాటికి దేవాదాయశాఖ డిప్యూటీ కమిషనర్..  25 లక్షల నుంచి కోటిలోపు ఆదాయం ఉన్న ఆలయాలకు దేవాదాయశాఖ కమిషనర్ పాలకమండళ్లు నియమిస్తారు. కోటికి పైగా ఆదాయం ఉన్నవాటికి ప్రభుత్వమే డైరెక్ట్ గా పాలకమండళ్లు నియమిస్తోంది. ఇప్పటికే కోటికి పైగా ఆదాయం ఉన్న యాదాద్రి, వేములవాడ, భద్రాచలం ఆలయాలకు పాలకమండళ్ల నియామకంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. పాలకమండళ్ల సభ్యులను పెంచడం వల్ల ఎక్కువ మంది ధార్మిక వేత్తలకు అవకాశం లభించినట్లవుతుందని ప్రభుత్వం భావిస్తోంది.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy