ఆల్ ది బెస్ట్: ఇవాళే టీఎస్ ఐసెట్

icetఇవాళ్టి టీఎస్ ఐసెట్-2017 ఎంట్రన్స్ ఎగ్జామ్ కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఉదయం 10 నుంచి 12:30 వరకు నిర్వహించనున్నట్టు తెలిపారు ఐసెట్-2017 కన్వీనర్ కె.ఓంప్రకాశ్. రాష్ట్రవ్యాప్తంగా ఐసెట్ పరీక్షకు77,422 మంది విద్యార్థులు దరఖాస్తులు చేసుకున్నారని, వారి కోసం 16 రీజినల్ సెంటర్లు, 132 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. అభ్యర్థులు ఉదయం 8:30 గంటలకు పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని, 9:30 గంటల వరకు విద్యార్థులకు బయోమెట్రిక్ హాజరు నమోదు చేసి పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించనున్నట్టు పేర్కొన్నారు. నిమిషం ఆలస్యమైనా అనుమతించరని వివరించారు. సమస్యలుంటే 0870-238088 ఫోన్ నంబర్‌లో సంప్రదించాలని కోరారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy