ఆల్ ద బెస్ట్ టీమిండియా : గెలిస్తేనే సిరీస్ ఆశలు

ind vs lankaలంకే కదా అనుకుంటే తొలి వన్డేతో భారత్ కు చుక్కలు చూపించారు శ్రీలంక ప్లేయర్లు. అయితే దీన్ని గుణపాఠంగా తీసుకున్నామని చెబుతున్న భారత ప్లేయర్లు..బుధవారం (డిసెంబర్-13) ఉదయం గం.11.30 ని.లకు మొహాలిలో జరిగే రెండో వన్డేకు కాస్త గట్టిగానే ప్రాక్టీస్ చేస్తున్నారు.

ప్రస్తుతం భారత్‌లో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా మొదటి వన్డేలో విజయం ఇచ‍్చిన ఆత్మవిశ్వాసంతో శ్రీలంక.. రెండో వన్డేకు సిద్ధమైంది. అయితే గత ఏడాదిన్నర కాలంలో ఏడు  ద్వైపాక్షిక వన్డే సిరీస్‌లు ఆడిన టీమిండియా.. అన్నింటిల్లోనూ విజేతగా నిలిచి తమకు తిరుగులేదని నిరూపించింది. ఆదివారం (డిసెంబర్ 10) ధర్మశాల వేదికగా జరిగిన మొదటి వన్డేలో బ్యాటింగ్‌లో పూర్తిగా చేతులెత్తేసిన టీమిండియా ఘోర పరాజయాన్ని చవిచూసింది. దీంతో భారత్‌ జట్టుకు రెండో వన్డేలో గెలుపు తప్పనిసరి. ఈ మ్యాచ్‌లో గెలిస్తేనే భారత్‌ జట్టు సిరీస్‌పై ఆశలు సజీవంగా ఉంటాయి. లేకపోతే ఇంకా మ్యాచ్‌ ఉండగానే సిరీస్‌ను సమర్పించుకోవాల్సి ఉంటుంది.

పిచ్ రిపోర్ట్..

మొహాలీ పిచ్‌ కూడా ధర్మశాల పిచ్‌ తరహాలోనే ఉండనుందని అంచనా వేస్తున్నారు. అయితే పిచ్‌పై పచ్చికను తొలగించి పూర్తిగా పేస్‌ బౌలింగ్‌ మాత్రమే కాకుండా బ్యాటింగ్‌కు కూడా అనుకూలంగా ఉండేలా తయారు చేశారని సమాచారం.  ఇక్కడ అత్యధిక స్కోరు 351/5  కాగా, అత్యల్ప స్కోరు 89/10. మరొకవైపు ఛేజింగ్ లో అత్యధిక స్కోరు 322/6. దాంతో పిచ్‌ను అంచనా వేయడం కష్టంగా మారింది. ఇక్కడ ఇప్పటివరకూ మొత్తంగా 23 వన్డేలు జరగ్గా, 14 సార్లు తొలుత బ్యాటింగ్‌ చేసిన జట్టు గెలవగా, 9 సార్లు రెండోసారి బ్యాటింగ్‌ చేసిన జట్టు విజయం సాధించింది. ఇక్కడ భారత్‌ జట్టు 14 మ్యాచ్‌లు ఆడగా, 9 సార్లు గెలుపొందింది. గత సంవత్సరం అక్టోబర్‌లో ఇక‍్కడ చివరిసారి న్యూజిలాండ్‌తో తలపడిన వన్డేలో భారత్‌ జట్టు ఏడు వికెట్ల తేడాతో విజయం నమోదు చేసింది.

జట్లు అంచనా

భారత జట్టు: రోహిత్‌ శర్మ(కెప్టెన్‌), శిఖర్‌ ధావన్‌, అజింక్యా రహానే, దినేశ్‌ కార్తీక్‌, మనీష్‌ పాండే, ఎంఎస్‌ ధోని, హార్దిక్‌ పాండ్యా, భువనేశ్వర్‌ కుమార్‌, కుల్దీప్‌ యాదవ్‌, బూమ్రా, యజ్వేంద్ర చాహల్‌

శ్రీలంక:తిషారా పెరీరా(కెప్టెన్‌), దనుష్క గుణతిలకా, ఉపుల్‌ తరంగా, లహిరు తిరుమన్నే,ఏంజెలో మాథ్యూస్‌, డిక్వెల్లా, అసెలే గుణరత్నే, సచిత్‌ పతిరన, సురంగా లక్మల్‌, అకిలా ధనంజయ, నువాన్‌ ప్రదీప్‌

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy