ఆసిఫా హత్యపై ఐరాసా : మానవ మృగాలకు ఉరే సరైన శిక్ష

unజమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలోని కతువా జిల్లాలో అత్యాచారం, హత్యకు గురైన 8 ఏళ్ల చిన్నారి అసిఫా ఘటనపై ఐక్యరాజ్య సమితి(UNO) స్పందించింది. ఇది ఒక భయానక ఘటనగా అభివర్ణించింది. నిందితులపై భారత అధికారులు చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నట్లు ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటె రస్, అధికార ప్రతినిధి స్టెఫానే డుజరిక్ శుక్రవారం(ఏప్రిల్-13) విలేకరుల సమావేశంలో తెలిపారు.

చిన్నారి అసిఫా అత్యాచారం, హత్యపై మీడియాలో వచ్చిన కథనాలు తమను కదిలించాయన్నారు. ఓ పసి ప్రాణాన్ని అతి భయంకర రీతిలో హింసించి.. చంపిన మానవ మృగాలను క్షమించకూడదన్నారు. తక్షణమే  నిందితులను ఉరి తీసి.. చిన్నారి అసిఫా ఆత్మకు శాంతి చేకూర్చాలని భారత ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. ఇలాంటి సంఘటనలు మరెక్కడా జరగకూడదని కోరుకుంటున్నట్లు తన సందేశంలో గుటె రస్ తెలిపారు. మరోవైపు ఈ ఘటన మన దేశానికి సిగ్గు చేటు అని, నేరస్థులను వదిలిపెట్టేది లేదని జాతికి హామీ ఇస్తున్నట్లు ప్రధాని మోడీ శుక్రవారం తెలిపారు.

 

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy