చారిత్రక కట్టాడాలతో దేశ ప్రజల దృష్టిని ఆకర్షించిన ఢిల్లీ….తాజాగా మరో ఘనతను సాధించింది. ఆసియాలోనే ది బెస్ట్ షాపింగ్ స్పాట్ గా టాప్ లో నిలిచింది. రకరకాల మోడళ్లు, బోలెడన్ని షాపింగ్ మాల్స్ తో కస్టమర్లను ఆకట్టుకోవడంలో ఢిల్లీ ముందుందని ట్రిప్ అడ్వైజర్ అనే సంస్థ నిర్వహించిన సర్వేలో తేలింది. షాపింగ్ పాపులారిటీ, స్టార్ హోటళ్ల నిర్వహకుల సలహాలు, కమర్షియల్ షాపింగ్ ప్రోగ్రామ్స్ ఆధారంగా షాపింగ్ లో టాప్ నగరాల లిస్ట్ ప్రిపేర్ చేసినట్టు చెప్పారు సర్వే నిర్వాహకులు. టాప్ నగరాల జాబితాలో ఢిల్లీ తరువాత… బ్యాంకాక్, సింగపూర్, బీజింగ్, హనోయ్, టోక్యో, సియోల్, కౌలాలంపూర్,ఖాట్మండు,జకార్తాలు నిలిచాయని సర్వే వెల్లడించింది. మరోవైపు మంచి షాపింగ్ ప్రదేశాలు, క్వాలిటీకి తగ్గ కాస్ట్ తెలిస్తేచాలు…ఆసియా నగరాల్లో షాపింగ్ డెడ్ ఈజీ అంటున్నారు మార్కెట్ ఎక్స్ పర్ట్స్. బ్రాండెడ్ షాపులతో పాటు, డిజైనరీ ఐటమ్స్ కు ఆసియా మార్కెట్సే బెటరంటున్నారు. కాస్ట్ అండ్ క్వాలిటీ తెలిస్తే చాలు…. ఈజీగా కొనెయొచ్చని చెబుతున్నారు.