ఆసియా కప్‌: ఆఫ్ఘానిస్తాన్ తో తలపడనున్న భారత్‌

డిఫెండింగ్‌ ఛాంపియన్‌ భారత్‌ ఆసియా కప్‌లో మరో విజయంపై కన్నేసింది. దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా ఇవాళ (మంగళవారం) జరిగే సూపర్‌-4 పోరులో అఫ్గానిస్తాన్‌తో ఆడనుంది. భారత బౌలర్లు ప్రతీ మ్యాచ్‌లోనూ తమ సత్తా చాటారు. పేసర్లు భువనేశ్వర్, బుమ్రా, స్పిన్నర్లు చహల్, కుల్దీప్‌లు నిలకడగా బౌలింగ్‌ చేశారు. పాకిస్తాన్ కు రెండుసార్లు చుక్కలు చూపించారు. ఈ మ్యాచ్‌లో ఓడితే భారత్‌కు ఎలాంటి నష్టం లేదు. అలాగే గెలిస్తే అఫ్గాన్‌కు లాభం లేదు. సూపర్‌-4లో ఆడిన రెండు మ్యాచ్‌లూ ఓడిన అఫ్గానిస్తాన్‌ విజయంతో ఊరట పొందాలని చూస్తోంది. ఇవాళ సాయంత్రం రెండు  దేశాల మధ్య మ్యాచ్ ప్రారంభం కానుంది.

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy