ఆసియా కప్‌ హాకీ: భారత్, కొరియా మధ్య మ్యాచ్ డ్రా

indiaఆసియా కప్ హాకీ టోర్నీ‌లో భారత్ జోరు కొనసాగిస్తోంది. సూపర్‌-4 పోరులో దక్షిణ కొరియాతో బుధవారం(అక్టోబర్-18) జరిగిన మ్యాచ్‌ని భారత్ 1-1తో డ్రాగా ముగించింది. కీలక మ్యాచ్ కావడంతో రెండు జట్ల ఆటగాళ్లు ప్రతిష్టాత్మకంగా తీసుకుని చివరి వరకూ విజయం కోసం పోరాడారు. 41వ నిమిషంలో లీ గోల్ చేసి కొరియాని 1-0తో ఆధిక్యంలోకి తీసుకెళ్లగా.. 60వ నిమిషంలో గుర్జాంత్ సింగ్ గోల్ చేసి 1-1తో ఆధిక్యాన్ని తగ్గించాడు. ఇక్కడ నుంచి రెండు జట్ల ఆటగాళ్లు గోల్ కోసం ఎంత శ్రమించినా ఫలితం లేకపోయింది.

గ్రూప్ దశలో జపాన్‌తో జరిగిన మొదటి మ్యాచ్‌లోనే 5-1 తేడాతో గెలిచిన భారత్.. అదే జోరుతో బంగ్లాదేశ్‌ని 7-0తో మట్టికరిపించింది. తర్వాత చిరకాల ప్రత్యర్థి పాక్తో జరిగిన మ్యాచ్‌లో 3-1తో విజయం సాధించడంతో గ్రూప్‌-ఎలో భారత్ అగ్రస్థానాన్ని దక్కించుకుంది. అయితే.. కొరియాతో మ్యాచ్‌లో మాత్రం ఆశించిన మేర రాణించలేకపోయినా.. డ్రాతో సరిపెట్టుకుంది.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy