ఆసియా కప్‌ : 25 ఓవర్లకు పాక్ -92/3

ఆసియా కప్‌ సూపర్ ఫోర్ మ్యాచుల్లో భాగంగా దుబాయ్ వేదికగా ఇవాళ భారత్‌ తో జరుగుతున్న మ్యాచ్‌ లో పాకిస్థాన్ కీలకమైన 3 వికెట్లను కోల్పోయింది. ఈ మ్యాచ్‌ లో పాకిస్థాన్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే చాహల్ వేసిన 8వ ఓవర్ ఆఖరి బంతికి ఇమామ్ ఉల్ హక్(10) LBW రూపంలో పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత కుల్దీప్ వేసిన 15వ ఓవర్ మూడో బంతికి ఫకార్ జమాన్(31) LBWగా వెనుదిరిగాడు.

ఆ తర్వాత కొంత సమయానికే జడేజా వేసిన 16వ ఓవర్ 5వ బాల్ కి బాబర్ ఆజామ్(9) రనౌట్ అయ్యాడు. దీంతో పాకిస్థాన్ 25 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్ల నష్టానికి 92 రన్స్ చేసింది. క్రీజ్‌ లో సర్ఫరాజ్ అహ్మద్(15), షోయబ్ మలిక్(21) రన్స్ తో నిలకడగా ఆడుతున్నారు.

 

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy