ఆసియా బ్యాడ్మింటన్‌ చాంపియన్‌ షిప్‌ : సైనాకు కాంస్యం

SAINAఆసియా బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌ లో భారత స్టార్‌ షట్లర్లు సైనా నెహ్వాల్‌, హెచ్‌ఎస్‌ ప్రణయ్‌ లు కాంస్య పతకంతోనే సరిపెట్టుకున్నారు. శనివారం (ఏప్రిల్-28) జరిగిన సెమీ ఫైనల్లో వీరిద్దరూ పరాజయం చెందడంతో కాంస్యంతోనే వెనుదిరిగాల్సి వచ్చింది. టోర్నీలో భాగంగా మహిళల సింగిల్స్‌ సెమీస్‌ లో సైనా 25-27, 19-21 తేడాతో టాప్‌ సీడ్‌ తైజు యింగ్‌(చైనీస్‌ తైపీ) చేతిలో ఓటమి పాలైంది. హోరాహోరీగా సాగిన పోరులో సైనా కడవరకూ పోరాడినా సెమీ ఫైనల్‌ అడ్డంకిని అధిగమించలేకపోయింది.

ఇక పురుషుల సింగిల్స్‌ సెమీస్‌ లో ప్రణయ్‌ 16-21, 18-21తేడాతో ఒలింపిక్‌ చాంపియన్‌ చెన్‌ లాంగ్‌(చైనా) చేతిలో పరాజయం చెందాడు. 52నిమిషాల పాటు సాగిన మ్యాచ్‌లో చెన్‌ లాంగ్ పైచేయి సాధించి ఫైనల్లోకి ప్రవేశించాడు.

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy