ఆసీస్ పై టీమిండియా గ్రాండ్ విక్టరీ

team-indiaచెపాక్ లో ఆసీస్ తో జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియా గ్రాండ్ విక్టరీ సాధించింది. 26 పరుగుల తేడాతో గెలుపు సొంతం చేసుకుంది కోహ్లీ సేన. 21 ఓవర్లలో 164 పరుగలు లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా 9 వికెట్లు కోల్పోయి 137 పరుగులు మాత్రమే చేసింది. అంతకు ముంద టీమిండియా ఇన్నింగ్స్ తర్వాత భారీగా వర్షం మొదలైంది. మధ్యలో ఒకసారి వర్షం తగ్గి ఆటగాళ్లు మైదానంలోకి వచ్చినా.. ఒక బంతి కూడా పడకుండానే మళ్లీ వెనక్కి వచ్చేశారు. దీంతో ఆస్ట్రేలియా లక్ష్యాన్ని 21 ఓవర్లలో 164 పరుగులుగా అంపైర్లు నిర్ణయించారు. అయితే పరుగుల ఛేదనలో వెనకబడింది ఆసీస్. దీంతో గెలుపు టీమిండియా సొంతమైంది. భారత బౌలర్లలో చాహల్ 3 వికెట్లు, హార్దిక్ పాండ్యా, కుల్దీప్ యాదవ్ చెరో రెండు వికెట్లు, బూమ్రా, కుమార్ చెరో వికెట్ తీసుకున్నారు.

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా హార్దిక్ పాండ్య (83), మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని (79) దూకుడుగా ఆడటంతో 7 వికెట్ల నష్టానికి 281 పరుగులు చేసింది. ఓపెనర్ అజింక్యా రహానే(5) నిరాశపరిస్తే, కెప్టెన్ విరాట్ కోహ్లి, మనీష్ పాండేలు డకౌట్ లుగా పెవిలియన్ చేరారు. ఆ తరుణంలో రోహిత్ శర్మ, కేదర్ జాదవ్ ల జోడి ఇన్నింగ్స్ మరమ్మత్తులు చేపట్టింది. ఈ జోడి నాల్గో వికెట్ 53 పరుగులు జత చేయడంతో టీమిండియా తేరుకున్నట్లు కనిపించింది. కాగా, రోహిత్ శర్మ(28) నాల్గో వికెట్ గా అవుట్ కావడంతో పాటు ఆపై కేదర్ జాదవ్(40) కూడా నిష్క్రమించడంతో భారత జట్టు 87 పరుగులకే ఐదు వికెట్లను నష్టపోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. భారత కోల్పోయిన ఐదు వికెట్లలో కౌల్టర్ నైల్ మూడు వికెట్లు సాధించగా, స్టోనిస్ రెండు వికెట్లు తీశాడు. తర్వాత క్రీజులోకి వచ్చిన ధోనీ, హార్దిక్‌ పాండ్యా సింగిల్స్‌ తీస్తూ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. హార్దిక్ 83 పరుగుల వ్యక్తిగత స్కోర్ దగ్గర ఔట్ అయినా… తర్వాత క్రీజులోకి వచ్చిన భువనేశ్వర్ కుమార్(32 నాటౌట్) సాయంతో ధోనీ చెలరేగి ఆడాడు. చివరి ఓవర్ లో ధోనీ ఔటయ్యాడు. ఆసీస్ బౌలర్లలో నైల్ 3 వికెట్లు తీసుకోగా, స్టోనిస్ 2 వికెట్లు, జంపా, ఫాల్కనర్ చెరో వికెట్ తీసుకున్నారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy