ఆస్కార్ బరిలో భారతీయుడి కథ

LIONఎన్నో అంచనాలు, ఎన్నో ఆశలు, పోటీలో ఎందరు నిలిచినా గెలిచేది మాత్రం కొందరే. అందరి చూపు ఆస్కార్ వైపే. ఈ నెల 25 రాత్రి 89వ ఆస్కార్ వేడుకు జరగనుంది. ప్రెస్టీజియస్ అవార్డ్ విన్నింగ్ కోసం ఈ ఏడాది బెస్ట్ మూవీస్ కేటగిరిలో తొమ్మిది సినిమాలు పోటీ పడుతున్నాయి. అయితే ఇందులో ఓ భారతీయుడి జీవితం ఆధారంగా తీసిన సినిమా కూడా ఆస్కార్ బరిలో నిలిచింది. ఇంతకీ ఆ తొమ్మిది సినిమాలు ఏంటో.. చూద్దాం.

అకాడమీ అవార్డు అంటే పెద్దగా తెలియకపోవచ్చు కానీ. ఆస్కార్ అంటేనే గుర్తిస్తారంతా. హాలీవుడ్ నుంచి టాలీవుడ్ దాక అంతా ఎదురుచూసే ప్రెస్టీజియస్ అవార్డ్ ఇది. అస్కార్ లో ఎన్ని అవార్డులున్నా..బెస్ట్ మూవీపైనే అందరీ కాన్ సంట్రేషన్.  బెస్ట్ మూవీస్ రేసులో  ఈసారి తొమ్మిది సినిమాలు పోటీపడుతున్నాయి.

బెస్ట్ మూవీస్ కేటగిరిలో లాలా ల్యాండ్ మూవీ రేసులో దూసుకెళ్తోంది. 30 మిలియన్ డాలర్లతో తీసిన ఈ మూవీ…3 వందల మిలియన్ల డాలర్లు వసూళ్లు చేసింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 14 ఆస్కార్ నామినేషన్లు అందుకుంది. ఆస్కార్ హిస్టరీలోనే అత్యధిక నామినేషన్లు అందుకున్న మూవీల ప్లేస్ లో నిలిచింది లాలా ల్యాండ్

మూన్ లైట్ ఈ మూవీ…హాలీవుడ్ చరిత్రలో ఓ రికార్డ్. కేవలం ఐదు మిలియన్ డాలర్ల అతి తక్కువ బడ్జెట్ తో తెరకెక్కింది. 22 మిలియన్  డాలర్లు వసూలు చేయటమే కాదు…8 ఆస్కార్ నామినేషన్లతో సత్తా చాటింది. ఈ మూవీ ఇప్పటికే గోల్డెన్  గ్లోబ్ దక్కించుకుంది. ఇన్  మూన్ లైట్  బ్లాక్  బాయ్స్  లుక్  బ్లూ అనే నవల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కించాడు దర్శకుడు బారీ జెన్ కిన్స్ .

సైన్స్ ఫిక్షన్ మూవీగా…తెరకెక్కిన సినిమా అరైవల్. స్టోరీ ఆఫ్ యువర్ లైఫ్…నవల ఆధారంగా ఈ మూవీ రిలీజ్ అయ్యింది. 8 ఆస్కార్ నామినేషన్లు సాధించింది. అరైవల్…195 మిలియన్ డాలర్ల వసూళ్లతో మంచి విజయం సాధించింది. డైరెక్టర్ డెనిస్ విలెన్యూవ్ తీసిన ఈ మూవీలో ఎమీ అడమ్స్ , జెరెమీ రెన్నర్  లు ముఖ్య పాత్రల్లో నటించారు.

లయన్…సరూ బ్రియర్లీ అనే ఓ ఇండియన్ నిజజీవిత కథ ఆధారంగా ఈ మూవీ తెరకెక్కింది. చిన్నతనంలో తప్పిపోయి… ఆస్ట్రేలియా చేరుకున్న ఓ భారతీయ కుర్రాడు…తన సొంతూరిని, కన్నవాళ్లను, సొంతభాషను మర్చిపోతాడు. పాతికేళ్ల తర్వాత అతడు తన ఇంటికి చేరుకోడానికి పడిన తపనను ఆవిష్కరించిన మూవీ లయన్. ముఖ్యంగా మేయిన్ రోల్ లో ఇండియా బ్రిటిష్  నటుడు దేవ్  పటేల్  నటించారు. ఈ మూవీకి 6 ఆస్కార్  నామినేషన్లు దక్కాయి.

25 మిలియన్ డాలర్లతో తీసిన మూవీ హిడెన్ ఫిగర్స్ …3 ఆస్కార్ నామినేషన్లు సాధించింది. నాసాలో పనిచేసే ముగ్గురు ఆఫ్రికన్ అమెరికన్ మహిళల జీవితకథగా ఈ మూవీ రిలీజ్ అయ్యింది. థియోడోర్  మెల్ఫి డైరెక్ట్ చేసిన ఈ మూవీలో తారాజి పి.హెన్సన్ , ఆక్టోవియా స్పెన్సర్ , జానెల్  మోనీ ప్రధాన పాత్రల్లో నటించారు.

ప్రపంచ సాహిత్య రంగంలో ప్రతిష్ఠాత్మకంగా భావించే పులిట్జర్  పురస్కారాన్ని గెలుచుకున్న ఫెన్సెస్  నాటకం ఆధారంగా…రూపొందించిన మూవీ…ఫెన్సెస్. ఆస్కార్  బరిలో 4 నామినేషన్లు అందుకుంది. ఫెన్సెస్  నాటక రచయిత ఆగస్ట్  విల్సనే ఈ మూవీకి స్క్రీన్ ప్లే.

మాంచెస్టర్  బై ది సీ…విమర్శకులు ప్రశంసలు అందుకున్న మూవీ. ఫాదర్ ను కోల్పొయిన ఓ కుర్రాడి జీవితం ఆధారంగా ఈ మూవీ తెరకెక్కింది. ఆస్కార్  బరిలోనూ 6 నామినేషన్లతో సత్తా చాటింది.

సెకండ్ వాల్డ్ వార్ లో పనిచేసిన ఓ డాక్టర్ లైఫ్ స్టోరీ ఆధారంగా రూపిందించిన మూవీ..హాక్ సా రిడ్జ్. 40 మిలియన్  డాలర్లతో తెరకెక్కిన ఈ మూవీ…164 మిలియన్  డాలర్లు వసూలు చేసింది. 6 ఆస్కార్  నామినేషన్లు సాధించింది.

క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కిన మూవీ హెల్ ఆర్ హై వాటర్. కుటుంబాన్ని పోషించుకోవటం కోసం బ్యాంకు దొంగలుగా మారిన ఇద్దరు బ్రదర్స్ కథతో ఈ మూవీ రిలీజ్ అయ్యింది. కెన్స్ చిత్రోత్సవంలో విమర్శకుల..ప్రశంసలు అందుకుంది.  ఫిబ్రవరి 28న అస్కార్ అవార్డుల లెక్క తేలిపోనుంది. సినీ లైఫ్ లో ఎన్ని అవార్డులు దక్కినా…అస్కార్ అవార్డు మజాయే వేరు.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy