ఆస్ట్రేలియాపై 4సెంచరీలు.. వన్డే మొనగాడు రోహిత్ వరల్డ్ రికార్డ్

ఆస్ట్రేలియాపై రోహిత్ శర్మ రికార్డులు బద్దలు కొట్టే సెంచరీ చేశాడు. 129 బాల్స్ లో 10 ఫోర్లు, 6 సిక్సర్లతో  133 రన్స్ చేశాడు రోహిత్ శర్మ. ఇది వన్డే కెరీర్ లో రోహిత్ శర్మకు 22వ సెంచరీ. ఆస్ట్రేలియాలో ఆస్ట్రేలియాపై రోహిత్ బాదిన నాలుగో సెంచరీ ఇది. వన్డేల్లో వారి సొంతగడ్డపై ఆస్ట్రేలియా మీద ఇన్ని సెంచరీలు ఏ దేశ బ్యాట్స్ మన్ కూడా కొట్టలేదు. వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజం వివ్ రిచర్డ్స్ ఆస్ట్రేలియాపై 3 సెంచరీలు చేశాడు. ఇప్పటివరకు ఈ రికార్డ్ ను సమం చేసిన రోహిత్ శర్మ… నాలుగో సెంచరీతో .. వివ్ రిచర్డ్స్ ను బద్దలుకొట్టాడు. ఆస్ట్రేలియాపై నాలుగు వన్డే సెంచరీలు చేసిన ఒకే ఒక్కడిగా నిలిచాడు. విరాట్ కోహ్లీ ఆస్ట్రేలియాపై 2 సెంచరీలు కొట్టాడు. కంగారూ టీమ్ పై 2 సెంచరీలు చేసిన 8మంది ఆటగాళ్లలో కోహ్లీ ఒకడు.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy