ఆస్ట్రేలియా క్లీన్‌స్వీప్..ఓడిన భారత్

womens-cricketవడోదర వేదికగా బరిలోకి దిగిన భారత అమ్మాయిల జట్టుకు నిరాశే ఎదురైంది. మూడు వన్డేల్లోనూ నిరాశే ఎదురైంది. బ్యాటింగ్, బౌలింగ్ లో సత్తా చాటిన ఆస్ట్రేలియా 3-0తో సిరీస్‌ను సొంతం చేసుకుంది. ఆదివారం(మార్చి-18) జరిగిన మూడో వన్డేలో 97 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. ఆసీస్ జట్టు ముందు టీమిండియా చేతులెత్తేయడంతో వైట్‌వాష్ తప్పలేదు. చివరి మ్చాచ్ లోనైనా  గెలిచిన పరువు కాపాడుకోవాలని భావించినప్పటికీ ఫలితం దక్కలేదు.

టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 332 పరుగులు చేసింది. భారత్ కు 333 పరుగుల టార్గెట్ ను  ఇచ్చింది. లక్ష్య ఛేదనకు దిగిన టీమిండియా 44.4 ఓవర్లలో 235 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్లు జెమీమా(42), స్మృతి మంధాన(52), మాత్రమే చెప్పుకోదగ్గ స్థాయిలో రాణించారు. భారీ ఇన్నింగ్స్ ఆడేందుకు ఏ ఒక్కరూ పోరాడకపోవడంతో తక్కువ స్కోరుకే పరిమితం కావాల్సి వచ్చింది.

ఆసీస్ బౌలర్లలో గార్డనర్ 3, మెగాన్, పెర్రీ చెరో రెండు వికెట్లు తీసుకున్నారు.

అంతకుముందు మొదట బ్యాటింగ్ చేసిన ఆసీస్ జట్టులో ఓపెనర్ అలిస్సా హేలీ(133)సెంచరీతో ఆస్ట్రేలియా భారీ స్కోరు చేసింది. హేలీని అడ్డుకోవడంలో భారత్ బౌలర్లు ఘోరంగా విఫలమయ్యారు. ఆసీస్ తరఫున హేనెస్(43), బెత్ మూనీ(34 నాటౌట్), గార్డ్‌నర్(35) పరుగులతో రాణించారు.

భారత బౌలర్లలో హర్మన్‌ప్రీత్ కౌర్ 2 వికెట్లు తీసుకుంది.పూనమ్ యాదవ్,శిఖా పాండే,దీప్తీ శర్మ,ఏక్తా తలా ఒక వికెట్ తీసుకున్నారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy