ఆ అపార్ట్ మెంట్ లో రూ.279 కోట్ల డబ్బు

monyనైజీరియాలో పాతుకు పోయిన అవినీతి, అక్రమాలపై ఉక్కుపాదం మోపుతోంది అక్కడి యాంటీ గ్రాఫ్ట్ ఎజెన్సీ(AGA). తాజాగా ఓ అపార్ట్ మెంట్ లో కట్టలు కట్టలుగా ఉన్న 279 కోట్ల 79 లక్షల 58 వేల 940 రూపాయల విలువ చేసే 43.4 మిలియన్ల అమెరికన్ డాలర్లను స్వాధీనం చేసుకుంది. బెడ్ రూమ్ లో కబోర్డ్ ల వెనక ఏర్పాటు చేసిన క్యాబిన్ లలో ఈ డబ్బుల కట్టలు పెట్టారు. మంగళవారం ఓ స్త్రీ బ్యాగులతో ఈ డబ్బులను ఆ ఆపార్ట్ మెంట్ లోకి తెచ్చినట్టు నైజీరియా అవినీతి నిరోధక సంస్థకు విశ్వసనీయ సమాచారమందింది. ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు.. బలహీనంగా.. రోగిలా కనిపించే స్త్రీతో ఆ డబ్బును ఆ గదుల్లోకి చేర్చారు. విజిల్ బ్లోయర్స్ అందించిన ఈ సమాచారంతో దాడులు నిర్వహించింది నైజీరియా AGA. దశాబ్దాలుగా నైజీరియాలో అవినీతి రాజ్యమేలుతోంది. దీనిపై దృష్టిపెట్టిన అక్కడి ప్రభుత్వం.. ఇటీవలే యాంటీ కరప్షన్ ఏజెన్సీని బలోపేతం చేసింది. విజిల్ బ్లోయర్స్ నుంచి సమాచారం అందుకునేందుకు ప్రత్యేకంగా వెబ్ పోర్టల్ ను ఏర్పాటు చేసింది. ఈ సంస్థకు సమాచారాన్ని అందించేవారి సమాచారాన్ని గోప్యంగా ఉంచేందుకు ఈ వెబ్ సైట్ పనిచేస్తోంది. అంతేకాదు వారి రక్షణకు ప్రత్యేకమైన చర్యలు తీసుకుంది. ఎవరైతే అవినీతి పరుల సమాచారమందిస్తారో… వారికి పట్టుకున్న సొమ్ములో 2.5 శాతం నుంచి 5 శాతం వరకు అందిస్తోంది. ఈ చర్యలే బొక్కసాల్లో దాచుకున్న కోట్లాది రూపాయలను నైజీరియా ఖజానాలోకి చేరుస్తోంది. నూతనంగా తీసుకొచ్చిన ఈ పాలసీతో ఫిబ్రవరి నాటికి 180 మిలియన్ల అమెరికన్ డాలర్లను స్వాధీనం చేసుకుంది యాంటీ కరప్షన్ ఏజెన్సీ. అంటే మన కరెన్సీలో వెయ్యి కోట్ల రూపాయలు.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy