ఆ అబ్బాయికి పొట్టలో గుండె

heart-boy2గుండె…. పిడికిలంత పరిమాణంలో… పావుకిలో బరువుండే రన్ మెషిన్. మనిషి బతకాలన్నా… చనిపోవాలన్నా గుండె పనితీరే ముఖ్యం. అలాంటి కీలకమైన పార్ట్ మనిషిలో ఎక్కడుంటుంది ? చాలా సింపుల్. ఛాతిలో ఎడమవైపు ఉంటుందనేగా అందరు చెప్పే సమాధానం. కరెక్టే. హార్ట్ అక్కడే ఉండాలి. అది మనిషి శరీర నిర్మాణధర్మం. అలా లేకపోతే ఏదో లోపమున్నట్టు. ఆ జీవి బతకడం కష్టమన్నట్టు. కానీ ఓ 18 ఏళ్ల కుర్రాడికి పొట్ట పైభాగంలో ఉంది. మామూలు లైఫే లీడ్ చేస్తున్నాడు. నమ్మట్లేదా ? అయితే ఈ స్టోరీ చదవండి.

 

heart-boyఈ అబ్బాయి పేరు అర్పిత్. వెస్ట్రన్ గుజరాత్ లో నదియాడ్ అనే ఓ మారుమూల గ్రామంలో ఉంటాడు. అందరిలాగే ఉంటే అర్పిత్ నేషనల్ ఫిగర్ ఎలా అవుతాడు. కానీ అయ్యాడు. ఈ అబ్బాయికి గుండె పొట్ట పైభాగంలో ఉంటుంది మరి. మనిషన్నాక గుండె ఎడమవైపే ఉండాలి. హార్ట్ బీట్ వినిపించాలి. కానీ అది కనిపించకూడదు. కానీ ఆ రూల్స్ ఏవీ అర్పిత్ గుండెకు లేవు. బెత్తెడు జారి పొట్టలోకొచ్చింది. అందుకే న్యూస్ మేకర్ అయ్యాడతను.

ఛాతిలో ఉండాల్సిన గుండె కడుపులోకొచ్చినా ఏ అనారోగ్య సమస్యల్లేవంటున్నాడితను. పైగా అందరిలాగే లైఫ్ లీడ్ చేస్తున్నాడు. ట్రాక్టర్ నడిపినా, బైక్ నడిపినా.. ఏదైనా పనిచేసినా ఏ ఇబ్బందీ లేదంటున్నాడు.

నిజానికి మానవ శరీరంలో గుండె నిర్మాణం చాలా సంక్లిష్టంగా ఉంటుంది. గుండెను కాపాడే గోడలు. నాలుగు ఛాంబర్లు. కుడి, ఎడమ వైపు ఆట్రియా(atria-కుహరం), వెంట్రికిల్స్(ventricle-జఠరిక). బాడీకి బ్లడ్ ని సప్లే చేసే వీన్స్. అవే రక్తనాళాలు. వీటన్నింటినీ పదిలంగా కాపాడేందుకు చుట్టూ ఓ పెద్ద బోన్. ఇలా ఎంతో క్లిష్టంగా ఉంటుంది గుండె నిర్మాణం. వీటిలో ఏ ఒక్కటి సరిగా లేకపోయినా హృద్రోగి అంటారు. చిన్న చిల్లు పడినా… లైఫ్ రిస్కే. స్టంట్లేసి హార్ట్ ని కాపాడాల్సి ఉంటుంది.

heart-boy3అర్పిత్ ది రేర్ డిసీజ్ అంటున్నారు డాక్టర్లు. మెడికల్ టెర్మినాలజీతో పెంటాలజీ అఫ్ కాంట్రెల్(pentalogy of cantrell) గా దీన్ని పిలుస్తారట. ప్రపంచవ్యాప్తంగా 156 మందికి మాత్రమే ఇలాంటి డిసీజ్ ఉందని లెక్కలు చెబుతున్నాయి. ఈ డిసీజ్ ఉన్నవాళ్లు 12 ఏళ్లకు మించి బతకరట. అలా బతికినవాళ్లు కేవలం 50 మందే. అందులో అర్పిత్ ఒకడు. నిజానికి అర్పిత్ కు ఎలాంటి ఇబ్బంది లేకున్నా.. అతని కేసులో ఐదు రకాల డిఫెక్ట్స్ ని గుర్తించారు. గుండెను కాపాడాల్సిన అప్పర్ బోన్ డెవలప్ కాలేదన్ని ఫస్ట్ ప్రాబ్లం. కడుపులో కండరాలు అభివృద్ధి కాలేదన్నది రెండో సమస్య. పొట్ట-ఛాతి మధ్య ఉండే కండరాలూ అభివృద్ధి చెందలేదన్నది మూడో ప్రాబ్లం. ఇక హార్ట్ ని కవర్ చేసే పెరికార్డియమ్(pericardium) కూడా సరిగ్గా ఇంప్రూవ్ అవలేదన్నది ఫోర్త్ ప్రాబ్లం. అన్నింటికి మించి గుండెకు ఓ చిల్లు ఉండటం అతిపెద్ద ప్రాబ్లం అంటున్నారు డాక్టర్లు. అర్పిత్ ఇన్నేళ్లు బతకడమే మెడికల్ మిరాకిల్ అంటున్నారు మెడికల్ ఎక్స్ పర్ట్స్. అతని గుండెను సరిచేసే అవకాశం లేదు. ప్రస్తుతానికి అతనికి ఏ సమస్యా లేదు. అందుకే బతికినన్నాళ్లు ఇలాగే ఉండటం తప్ప చేసేదేం లేదంటున్నారు.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy