ఆ ఇన్ఫర్మేషన్ నా దగ్గర లేదు: గవర్నర్

ING-240414-DEL-GOVERNERATAPBAVAN 00002722ఢిల్లీలో పర్యటిస్తున్న గవర్నర్ నరసింహన్… రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ను కలిశారు. ప్రెసిడెంట్ గా ఎన్నికైన కోవింద్ కు విషెస్ చెప్పారు. మధ్యాహ్నం పార్లమెంట్ హాల్లో కేంద్ర మంత్రి జితేందర్ సింగ్ ను కలిశారు గవర్నర్. తదనంతరం ప్రధాని నరేంద్ర మోడీతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు.

ఇదిలా ఉంటే పార్లమెంట్ సెషన్ తర్వాత కేంద్ర కేబినెట్ లో మార్పులతో పాటు..గవర్నర్లను మార్చే అవకాశం ఉంది. అయితే గవర్నర్ నరసింహన్ పదవి కాలం ఇప్పటికే ముగిసింది. దీంతో తెలుగు రాష్ట్రాల తాత్కాలిక గవర్నర్ గానే కొనసాగుతున్నరు నరసింహన్. ఈ సెషన్స్ తర్వాత జరిగే మార్పుల్లో  నరసింహన్ ను కేంద్ర భద్రత విభాగాల్లోని కీలక పోస్టులో నియమించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే  మార్పు మీద..తన దగ్గర ఎలాంటి సమాచారం లేదంటున్నారు నరసింహన్. ఈ టూర్ లో  రాష్ట్రపరిస్థితులపై కేంద్ర పెద్దలకు వివరించారు గవర్నర్ నరసింహన్.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy