ఆ ఎస్పీనే ఎందుకు అనుమానించాలి..?

SP_Gurdaspurపఠాన్ కోట్ లో టెర్రర్ ఆపరేషన్ ముగిసింది. కానీ.. కథ ఇక్కడితో ముగిసిపోలేదు. ఇంట్రెస్టింగ్  స్టోరీ ఇక్కడే  మొదలైంది. బార్డర్ లో కట్టుదిట్టమైన  భద్రతను తప్పించుకుని టెర్రరిస్టులు దేశంలోకి ఎలా చొరబడ్డారు.? ఆ తర్వాత  దేశంలో వారికి సహకరించిన వ్యక్తులు ఎవరు..? 20 గంటల పాటు వారు దేశంలో స్వేచ్ఛగా తిరిగినా …పోలీసులు ఎందుకు పట్టుకోలేకపోయారు..? ప్రస్తుతం  ప్రతీఒక్కరి మదిలో మెదులుతున్న ప్రశ్నలివి. ఇంతకీ.. డిసెంబర్ 31 రాత్రి ఏం జరిగింది..?

పఠాన్ కోట్ ఉగ్రదాడి వ్యవహారంలో అన్ని వేళ్లూ ఇప్పుడు గురుదాస్ పూర్ ఎస్పీ సల్వీందర్ సింగ్ వైపే చూపిస్తున్నాయి. కతువా సమీపంలోని ఓ దర్గాకు  వెళ్లి వస్తున్న తనను టెర్రరిస్టులు కిడ్నాప్ చేశారని..  ఆ తర్వాత వదిలేశారన్నది ఎస్పీ సల్వీందర్ సింగ్ స్టేట్మెంట్. అయితే… డిసెంబర్ 31న ఎస్పీ… రాత్రి 9.30 గంటలకు దర్గాను సందర్శించాడని అక్కడి పూజారి సోమ్ నాథ్ స్టేట్ మెంట్. రాత్రి 12.30 తర్వాత టెర్రరిస్టుల చెర నుంచి బయటపడ్డానని ఎస్పీ కథనం. మరి మధ్యలో మూడు గంటలు ఏం జరిగింది. డ్రైవర్ ను చంపిన ఉగ్రవాదులు… ఎస్పీకి ఎలాంటి హాని చేయకుండా ఎందుకు వదిలేశారు.?

ఇదొక్కటే కాదు.. ఎస్పీ చెప్పిన చాలా విషయాలకు, పూజారి చెబుతున్న అంశాలకు ఎక్కడా మ్యాచ్ అవ్వట్లేదు. డిసెంబర్ 31న ఒకేరోజు రాత్రి రెండుసార్లు పంజ్ పిర్ దర్గాను ఎస్పీ సందర్శించాడన్నది పూజారి కథనం. ఇక పంజ్ పిర్ దర్గాకు రెగ్యులర్ గా వెళ్లొస్తుంటానని ఎస్పీ చెప్పాడు.  కానీ పూజారి మాత్రం అలాంటిదేం లేదంటున్నాడు.

ఎస్పీపై డౌట్ రావడానికి చాలా స్ట్రాంగ్ రీజన్స్ ఉన్నాయి. ఉగ్రవాదులు దేశంలోకి చొరబడినట్టుగా చెబుతున్న బమియాల్ నుంచి.. ఎస్పీ వెళ్లినట్టు చెబుతున్న కతువాకు దాదాపు 25 నుంచి 30 కిలోమీటర్ల దూరం ఉంటుంది. కతువానుంచి గురుదాస్ పూర్ కు దాదాపు 60 కిలోమీటర్లుంటుంది. గురుదాస్ పూర్ వెళ్లాలంటే పఠాన్ కోట్ మీదుగానే వెళ్లాలి. కానీ కతువాకు, పఠాన్ కోట్ కు 20 కిలోమీటర్ల కన్నా ఎక్కువ దూరం ఉండదు. ఈ రూట్ లోనే ఉగ్రవాదులు తమను కిడ్నాప్ చేశారని ఎస్పీ చెబుతున్నారు. కిడ్నాపైన కొద్దిసేపటికే రాత్రి పన్నెండున్నర తర్వాత తనను వదిలేశారనేది ఎస్పీ కథనం. ఇది చాలా అనుమానాలను క్రియేట్ చేస్తోంది. కేవలం 20 నుంచి 30 కిలోమీటర్ల దూరం ప్రయాణించడానికి అంతటైం ఎందుకుపట్టిందనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న.

ఎస్పీ సల్వీందర్ సింగ్ దర్గా ను సందర్శించడం దగ్గర నుంచి.. ఉగ్రవాదుల చెరనుంచి బయటపడటం వరకు.. ప్రతీ సీన్ లోనూ వందలకొద్దీ ప్రశ్నలు. దీంతో ఇష్యూను సీరియస్ గా తీసుకుంది NIA. ఎస్పీని తమ కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు NIA అధికారులు. కిడ్నాప్ జరిగిన ప్రాంతాన్ని, టెర్రరిస్టులు దేశంలోకి చొరబడిన బమియాల్ ప్రాంతాన్ని పరిశీలించారు. ఎస్పీ చెబుతున్న కిడ్నాప్ సీన్ మొత్తాన్ని రీ క్రియేట్ చేస్తోంది NIA. మరోవైపు దర్గా చుట్టుపక్కల పాకిస్తాన్ మేడ్ బూట్ల గుర్తులను NIA గుర్తించింది. దాంతో ఎస్పీపై అనుమానాలు మరింత బలపడుతున్నాయి.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy