ఆ కిక్కే వేరబ్బా : ధియేటర్ల దగ్గర రజనీ అభిమానుల సందడి

rajaకాలా సినిమా రిలీజ్ సందర్భంగా దేశ్యాప్తంగా ధియేటర్ల దగ్గర రజనీ అభిమానులు సందడి చేశారు. పెద్ద సంఖ్యలో ధియేటర్లకు చేరుకొని రజనీ కటౌట్లకు పాలాభిషేకం చేశారు. ఇక తమిళనాడు ధియేటర్ల దగ్గర బాణసంచా పేల్చి జై తలైవా అంటూ నినాదాలు చేశారు. ఉదయం 4 గంటలకే తమిళనాడులో కాలా మూవీని ప్రదర్శించారు. ఈ మూవీని చూసేందుకు మలేషియా, సింగపూర్ దేశాల నుంచి కూడా చెన్నైకి వచ్చారు రజనీ అభిమానులు. మహారాష్ట్రలో కూడా రజనీ అభిమానులు కాలా సినిమా ఫస్ట్ షో చూసేందుకు పెద్ద సంఖ్యలో ధియేటర్లకు తరలివచ్చారు. మరోవైపు కాలా మూవీపై కర్ణాటకలో కన్నడ సంఘాలు ఆందోళనలు చేస్తున్నారు. భారీ భధ్రత మధ్య బెంగళూరులోని ఓరియన్ మాల్, మంత్రి స్వ్కేయర్ మాల్స్ లో కాలా మూవీని ప్రదర్శిస్తున్నారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy