ఆ కుక్కలో మనిషి పోలికలు

2కోతి రూపం నుంచి మనిషిగా మారిన విషయం తెలుసు. కానీ..కుక్క రూపం నుంచి మనిషిగా మరాడం చూస్తే షాక్ కావాల్సిందే. కుక్క‌లు కూడా మ‌నిషి రూపంలో ఉంటాయంటే ఎవ‌రూ న‌మ్మ‌రు. పైగా ఎగతాలిగా చూస్తారు. ఈ ఫొటోల‌ను చూసిన త‌రువాత న‌మ్మ‌క త‌ప్ప‌దేమో అనిపిస్తుంది. ఎందుకంటే.. ఎలాంటి మార్ఫింగ్ గానీ, ఫొటోషాప్‌లో ఎడిట్ చేసిన పిక్స్ గానీ కావు ఇవి. ఈ పెంపుడు కుక్క అమెరికాలోని వాషింగ్ట‌న్‌లో ఉంది.

ఛాంట‌ల్ డెస్జ‌ర్డానిస్ అనే మ‌హిళ దీన్ని పెంచుకుంటోంది. షిపూ ఆలియాస్ యోగి అనే అరుదైన జాతికి చెందిన శున‌కం ఇది. దీని వ‌య‌స్సు 11 నెల‌లు. మ‌నిషి రూపంలో ఉండే శున‌కాన్ని, ఓ సాధార‌ణ పెంపుడు కుక్క పిల్ల‌ను ప‌క్క‌ప‌క్క‌నే పెట్టి, ఓ ఫొటో తీసి, దాన్ని సోష‌ల్ మీడియాలో షేర్ చేశారు ఛాంట‌ల్‌. ఈ ఫొటోలు ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాను ఓ ఊపు ఊపేస్తున్నాయి. చూడ్డానికి ఈ కుక్క‌పిల్లతో హాలీవుడ్ స్టార్ హీరోలను పోల్చుతున్నారు. నికొల‌స్ కేజ్, ఎడ్ ష‌రీన్‌, లియోనార్డో డికాప్రియోల రూపంలో ఉందంటూ ఉందంటూ ట్వీట్లు చేస్తున్నారు నెటిజ‌న్లు.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy