ఆ కుక్క చాలా లక్కీ

driver-dogప్రతి కుక్కకు ఒక రోజు వస్తుంది..అనేది సామెత. ఇది సామెతే అయినా బొలీవియాలో జరిగిన ఘటన చూస్తే నిజమే అన్పించక తప్పదు. అదృష్టం అంటే నిజంగా ఆ కుక్కదే. ప్రాణాలు పోవటం ఖాయమనుకున్న అద్దుతం జరిగి చిన్న గాయం కూడా కాకుండా అది తప్పించుకుంది. కాస్తుంటే తునాతునకలైపోవాల్సిన ఆ శునకం ఆశ్చర్యకరంగా తప్పించుకోవడం మిరాకిలే. ఈ వీడియో చూశాక దీనంత అదృష్టవంతురాలు ప్రపంచంలోనే మరొకటి ఉండదని మీరు అంటారు.

ఆదివారం (జూన్25) సెలవు కావడంతో బొలీవియాలో ‘కొడాసర్- 2016’ పేరుతో కార్ రేసింగ్ పోటీలు నిర్వహించారు. ఈ పోటీలను చూసేందుకు చిన్నారుల దగ్గరి నుంచి పెద్దల వరకు పెద్ద ఎత్తున తరలివచ్చారు. గతుకుల మట్టిరోడ్డుపై ఈ రేసింగ్ పోటీలు జరుగుతున్నాయి. కార్లు మెరుపువేగంతో దుమ్మురేపుకుంటూ వెళ్తున్నాయి సినిమాలో యాక్షన్ సీన్ చూస్తున్నట్టుగా వుంది. రయ్ రయ్ మంటూ కార్లు రోడ్డుపై దూసుకెళ్తుండడంతో భయపడిన ఓ కుక్క రోడ్డుపైకి వచ్చింది. ఈలోగా మరోకారు వేగంగా దూసుకువస్తోంది. దీనిని చూసినవారు కాసేపు భయపడ్డారు. కుక్క మీది నుంచి కారు దూసుకుపోవడం ఖాయమని అనుకున్నారు.

కుక్కకు చావుతప్పదని డిసైడ్ అయి ఆ దారుణాన్ని చూడలేని కొందరు కళ్ళు మూసుకున్నారు. సరిగ్గా అప్పుడే జరగరాని అద్భుతం జరిగింది. కారు కుక్క దగ్గరికి వస్తూనే కారు గాల్లోకి ఎగిరింది. కుక్కమీది నుంచి పైకి ముందుకు దూకి…తాపీగా వెళ్లిపోయింది. దీన్ని చూసిన వాల్లంతా ఆనందాశ్చర్యాలతో కేరింతలు కొట్టారు. చనిపోతుందనుకున్న ఆ డాగ్ కు అసలు ఏం జరిగిందో కూడా అర్థం కాకుండానే తన దారిన తాను వెళ్లిపోయింది. కారు యథావిధిగా అదే వేగంతో దూసుకుపోయింది. కుక్క ప్రాణాలు పోవటం అంతా ఖాయమనుకున్నారు. అద్దుతం జరిగి చిన్న గాయం కూడా కాకుండా అది తప్పించుకుంది. కొంచెంలో తునాతునకలైపోవాల్సిన ఆ శునకం ఆశ్చర్యకరంగా తప్పించుకోవడం మిరాకిలే.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy