ఆ కేఫ్ లో కాఫీ తాగాలంటే పక్కన పిల్లి ఉండాల్సిందే..!

First Australian Cat Cafe Opens In Melbourne

పిల్లిని పక్కన బెట్టుకొని కాఫీ తాగుతున్న వీళ్లను చూశారుగా..

కొన్ని కాఫీ షాపులు ఆఫర్స్ పెడుతుంటాయి. వన్ ప్లెస్ వన్… వన్ ప్లెస్ టు… వన్ ప్లస్ త్రీ… అని…ఇలా వెకేషన్ బట్టి.. ఆఫర్స్ ఇస్తుంటాయి. అలాగే ఆ కాఫీ షాప్ కూడా ఓ ఆఫర్ పెట్టింది. కాకపోతే అవి…ఈ వన్ ప్లస్ వన్, టు ప్లస్ టులు కాదు. కాస్త డిఫరెంట్. ఇంతకీ ఏంటా బంపర్ ఆఫర్. కాఫీ కేఫ్… ద లవర్స్ అడ్డా. కేఫ్ కి ఎవరు వచ్చినా రాకపోయినా ఓకే గానీ… లవర్స్ రాకపోతే ఆ కేఫ్ డీలా తీయాల్సిందే. అందుకే యూత్ ను అట్రాక్ట్ చేయడానికి ఈ కాఫీ షాప్ డిఫిరెంట్ ఆఫర్ పెట్టింది. అదే కాఫీ విత్ క్యాట్. ఇక్కడ కాఫీ తాగాలంటే పక్కన పిల్లి ఉండాల్సిందే.

దీని పేరు కూడా అదే. క్యాట్ కేఫ్. కాఫీ తో పాటు పిల్లులు కూడా ఉంటాయి. ఇదున్నది సిడ్నీ.. క్యాప్టల్ ఆఫ్ ఆస్ట్రేలియా. పిల్లి ప్రేమికులు సరదాగా వాటితో ఆడుకుంటూ…కాఫీ తాగొచ్చు. ఆ షాపులో బోలెడు పిల్లులుంటాయి. అవి కూడా రకరకాల క్యాట్స్. అలా అని… పిల్లులతో ఆడుకోవడం ఫ్రీ కాదండోయ్. అరగంటలకు ఐదు డాలర్లు పే చేసి మరీ పిల్లులతో ఆడుకోవచ్చు. ఈ పిల్లుల కాన్సెప్ట్ నచ్చితే ఆ కేఫ్ విస్తరణకు ఫండ్స్ కూడా డొనేట్ చేయొచ్చు. ఇప్పటికైతే ఈ కేఫ్ ను నెలకు నాలుగు రోజులే నిర్వహిస్తున్నారు. కానీ జులై నుంచి దీన్ని పూర్తి స్థాయిలో నిర్వహిస్తామని చెబుతున్నారు కేఫ్ మేనేజ్ మెంట్.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy