ఆ పప్పీ జలకాలు మీరూ చూడండి

418449-puppybathజంతువులు జలకాలాడతాయని తెలుసు. కానీ అచ్చం మనుషుల్లాగే చేస్తే మాత్రం అది విశేషమే అవుతుంది. లండన్ లో ఇలాంటిదే జరిగింది. ఒక ఇంటి స్నానాల గదిలో ఓ బుజ్జి కుక్కపిల్ల స్నానం చేసింది. అయితే అది స్నానం చేసిన తీరే అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. బాత్ టబ్ లో స్నానం చేసిన ఆ పస్పీ.. స్నానం తర్వాత ట్యాప్ ఆఫ్ చేసింది. ఆ తర్వాత టవల్ తో తుడుచుకొని హాయిగా బబ్బుంది. ఇక్కడి వరకు పప్పీ చేసిన పనులన్నీ మనుషులను గుర్తు చేయడం విశేషం. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. పప్పీ బాత్ షో చూసి అందరూ ఔరా అనుకుంటున్నారు.

Comments are closed.

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy