ఆ పాటకు మూడున్నర కోట్లు

2బ్రహ్మోత్సవంలో ఓ సాంగ్ కోసం మూడున్నర కోట్లు ఖర్చు చేశారంట. 500 మంది జూనియర్ ఆర్టిస్ట్ లతో తెరకెక్కించారు. సినిమాలోని అన్ని పాత్రలు ఈ సాంగ్ లో కనిపించనున్నాయి. ఇప్పటికే బ్రహ్మోత్సవంలో క్యారెక్టర్స్ ఆసక్తి రేపుతున్నాయి. ఫ్యామిలీ మూవీస్ తీయటంలో స్పెషల్ అయిన శ్రీకాంత్ అడ్డాల.. ఈ మూవీని కూడా ఫ్యామిలీ ఎంటర్ టైన్ మెంట్ గా తెరకెక్కించనున్నారు. సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు వంటి మల్టీస్టారర్ మూవీని తీసిన ఈ దర్శకుడు..  ఆ రేంజ్ లోనే ఈ మూవీ కూడా ఉంటుందనే సంకేతాలు ఇస్తున్నారు. ఒక్క సాంగ్ కోసం మూడున్నర కోట్లు ఖర్చు చేయటం ఇండస్ట్రీ రికార్డ్ అంటున్నారు. శంకర్ ఐ మూవీలో ఓ సాంగ్ కోసం ఐదు కోట్లు ఖర్చుచేశారు. ఆ తర్వాత.. ఇదే రికార్డ్. మూడున్నర కోట్లు ఓ పాట కోసం ఖర్చు చేశారంటే… మూవీ బడ్జెట్ ఏ రేంజ్ లో ఉందో అర్థం అవుతుంది. డబ్బు తగ్గట్టుగా సాంగ్ మేకింగ్ ఎలా ఉందో చూడాలి..

https://www.youtube.com/watch?v=1RG9nI1hB-M

Comments are closed.

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy